Bhimalapuram.co.in
శ్రవణానందము
వ్రాత రూపమున వున్న ఒక వ్యాసమును చెవుల ద్వార వినగల వసతి[package] "స్పీచ్ సిన్తెసిస్" అన బడును. ఇది సాదించుటకు లైనుక్స్/ఫ్రీబీఎస్డీలో చాల పనిముట్లున్నవి.
"ఫెస్టివల్" అటువంటి పనిముట్లలో ఒకటి. "ఫెస్టివల్"నే ఎన్నుకొనుటకు మూడు కారణములున్నవి.
- నేర్చుకొనుటకు చాల సులభమైనది. ఉపయోగించుటకు సరైన సరళమైన టిప్పణీలతో లభించుచున్నది.
- లైనుక్స్/ఫ్రీబీఎస్డీలలో అమర్చబడి వుంటుంది లేక సులభముగ అమర్చ గలము.
- తెలుగు భాషకు ఉపయోగపడు "ఫెస్టివల్-టి" అను పరికరము "ఫెస్టివల్"తో- సులభముగ - ఎటువంటి ఇబ్బందులు లేకుండ- పని చేయును.
ఈ వసతి[package]ని రెండు విదనమున ప్రయోగింప గలరు.
ఆంగ్లము
- "festival" అనే ఆదేశము[command] తో ఈ సేవను ప్రారంభింపవలెను. తరువాత "(tts "FILENAME" nil)" అనే ఆదేశము ఇచ్చిన, మీ వ్యాసమును ఆంగ్లమున వినగలరు. ఇవ్వవలసిన ఆదేశము వ్యాసము పేరు xyz.txt ఐతే - "(tts "xyz.txt"nil)".
- వ్యాసమును వినతగిన audio fileగ మార్చుకొనుటకు ఇవ్వవలసిన ఆదేశము [command] : ఆగ్ రుపమున కావలసినచో: "text2wave xyz.txt -o xyz.ogg". వేవ్ రూపమున కావలసినచో : "text2wave xyz.txt -o xyz.wav". {పత్రము పేరు xyz.txt; audio file పేరు xyz.ogg లేక "xyz.wav"). ఈ audio file వినుటకు తగిన పరికరములు : వీఎల్సి లేక అడాసిటి వంటివి.
తెలుగు
- "ఫెస్టివల్" అమర్చుకొన్న తరువాత wwwDOTsourceforgeDOTnet నుండి లేక ఇక్కడ నుండి కాని festival-te దిగుమతి చేసుకొని అమర్చుకొనవలెను.
- మీ తెలుగు వ్యాసమును ఒక గద్యముగ [text file] ".txt" అను చిహ్నముతో మార్చుకొనవలెను.
- మొదట ఇవ్వవలసిన ఆదేశము : "festival".
- తరువాత ఇవ్వవలసిన ఆదేశములు: అ. "(voice_telugu_NSK_diphone)"; ఆ. "(tts "teluguexample.txt" nil)". [ఇక్కడ file పేరు teluguexample.txt"]. ఇప్పుడు మీ వ్యాసమును తెలుగులో వినగలరు.
- "text2wave...." ఆదేశము మాకు "ఫెస్టివల్-టి" లో ఫలితము యివ్వలేదు.
- ప్రవేశము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు
- పరిచయము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు
- స్తోత్రములు ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు
- కీర్తనలు ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు
- మరిచినవంటకములు ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు
- దొరకని పుస్తకములు ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు
- సామెతలు ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు
- జానపదకళలు ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు
- క్షేత్రములు ఆంగ్లము తెలుగు తెలుగు లిపి లేదు
- ఉచిత స్వేచ్చ పరికరములు ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు
- తెలుగు కొఱకు ఉచిత-స్వేచ్చా పరికరములు ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు