Bhimalapuram.co.in
ఆక్ (AWK)

ఆంగ్లము తెలుగులిపిలేదు

ఆక్ అతి క్లిష్టమైన సమస్యలను సునాయాసముగ- కొన్ని పంక్తుల ఆదేశములతో పరిష్కరింపగలదు. ఈ వసతిలోని ఆదేశములు ఆక్ అను పదముతో మొదలగును. ఒక దస్త్రమునైనను(single file) లేక మొత్తము విభాగము(entire directory)నైనను for do done అను పునర్వృత్తము(loop)తో పరిష్కరింపగలదు.

ఉదాహరణములు :

మనవి : ఆక్ ఆదేశములు కచ్చితమైన/దిట్టమైన పదములు/ సంకేతములతో కూడినది. ఆదేశములలో పదముల మధ్య అనవసరమైన ఖాళీ స్థలము, ఉన్న ఖాళిస్థలము/సంకేతములను తొలగించుట, సంకేత చిహ్నము(special characters)లలో తేడా - ఇటువంటి సూక్ష్మ తేడాలచే అదేశములు సరైన ఫలితములివ్వకపోవచ్చును. కనుక ఇవ్వదలచిన ఆదేశములను క్షుణ్ణముగ పరిశీలింప వలెను.

"awk '/pattern/{print}' " అను ఆదేశముతో ప్రత్యేకమైన- కావలసిన పదజాలమును ఎన్నుకొనవచ్చును. "awk '/5 warnings/ {print $1}' mistakes.txt> five.txt" అను ఆదేశముతో 1,2,3,4,5 తేడాలు గల mistakes.txtఅను పత్రము/దస్త్రమునుండి 5తేడాలు గల పంక్తులను వేఱుచేసి five.txt అను పత్రమున ఉంచుట సాధ్యమైనది.

"awk '{print0}' ragalist.txt"అను ఆదేశము "ragalist.txt" అను పత్రము/దస్త్రమును సూచించినట్టు ప్రచురించును. "awk '{print $2,$3,$5}' cities.txt> newcities.txt" అను ఆదేశము cities.txtలోని 2,3 5వ fieldsలను fields మధ్య ఖాళీ స్థలము సరిహద్దుగ గల newcities.txtఅను క్రొత్త పత్రమున ప్రచురించును. "awk '{print $2,",",$3,","$4} cities.txt> newcities.txt" అను ఆదేశము 2వ field, తరువాత "," 3వ field, తరువాత "," తరువాత 4వ fieldలను "newcities.txt" అను పత్రముగ సృష్టించును .

పంక్తులలోని fieldsల వరుసక్రమమును ఇష్టానుసారము మార్చుకొనవచ్చును. "awk -F '{print $4,",",$3,",",$1} cities.txt> newcities.txt" అను ఆదేశము "cities.txt" అను పత్రము/దస్త్రమున ఉన్న పంక్తులలోని 4, 3, మొదటి fieldsలను "newcities.txt" అను పత్రముగ సృష్టించును.

ఒక దీర్ఘమైన పత్రము నుండి కావలసిన పంక్తులను విడదీయుట: :: " awk 'NR>=34 && NR<=56' inputfile> newfile." ఈ ఆదేశము 34 నుండి 56 పంక్తులను మాత్రము క్రొత్త పత్రముగ సృష్టించును.

"awk '{if(NR==69) print NR, $0}' inputfile> outputfile" - ఈ ఆదేశము 69 పంక్తిని మాత్రము క్రొత్త పత్రముగ సృష్టించును.

"for files in *html; do awk '{if(NR==69) print NR, $0}' "$files"; done> result.txt". ఈ ఆదేశము సూచించిన హెచ్‌టీ్ఎంఎల్ ప్రత్యయము గల పత్రములోని 69వ పంక్తులను మాత్రము result.txtఅను పత్రముగ సృష్టించును.(కారణము:: ఈ పంక్తిలో సూచింపబడిన షరత్తులను పరిశీంచి, అవసరమైన మార్పులు/సవరణలు చేయుట).

ఆక్ గురించిన టిప్పణులను క్షుణ్ణముగ చదివి, ఈ వసితిని సంపూర్ణముగ ఉపయోగింపగలరు.

విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!