Bhimalapuram.co.in
Shell Scipts- బాష్ సూత్రములు

ఆంగ్లము తెలుగులిపిలేదు

లైనక్‌స్ విధానమును నడుపించు మాధ్యము shell అనబడును. csh, rsh, ksh, bash అని పలు రకములైన shells ఉన్నవి. వీటిలో బాష్(bash) ఎక్కువగ వాడబడుచున్నవి. ప్రధానమైన లైనక్‌స్‌లలో సామాన్యముగ బాష్ వాడబడుచున్నది. కనుక బాష్‌తో వాడబడు సూత్రములను గురించి వివరింపబడినవి.

బాష్ చాల చాతుర్యము గల మాధ్యము. చాల సరళమైన ధోరణి/శైలి గలది. సెడ్, ఆక్ వంటి వసతుల ఆదేశములను, పేర్‌ళ్ వంటి భాషలను కలిపి బాష్ సూత్రములలో వాడవచును. సెడ్, ఆక్‌ల ఆదేశములను వరుసగ ఉపయోగింపవచ్చును. పునర్వృత్తము(loop)ల అవసరముగల క్రియలను బాష్ సూత్రముల ద్వార సులభముగ చేసుకొనవచ్చును. సుదీర్ఘమైన/క్లిష్టమైన క్రియలను చాల చిన్న బాష్ సూత్రముల ద్వార చేసుకొనవచ్చును.

వాక్యావళి: ఈ సూత్రములు "#!/bin/bash" అను వాక్యముతో సామాన్యముగ ప్రారంభింపబడును. పేరులో అంత్యమున ".sh" అను ప్రత్యయము చేర్చుట ఉచితము. shell సూత్రములను chmod అదేశము ఉపయోగించి ప్రయోగాత్కము(executable)గ చేయ వలెను. తరువాత "./" అను చిహ్నమును scriptపేరుతో కలిపి ఆదేశము ఇవ్వవలెను( "./name of Script.sh").

ఉదాహరణము - మా అనుభవము: తోడి రాగము పేరు "తోండి" అని వ్రాయబడినది. "for f in a*html do sed -i '46 s/తోండి/తోడి/' $f done" అను shell సూత్రముతో ఈ పొరపాటు సవరింపబడినది. ఈ ఒక చిన్న సూత్రముతో 40 కీర్తనలలోని పొరపాటుని - 15 విభాగములలోని 15000 కీర్తనలను వెదకి- సవరించుట సాధ్యమైనది.

విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!