Bhimalapuram.co.in
బీస్డీతో పరిచయము
బీఎస్‌డి లైనక్‌స్‌వలె యునిక్‌స్‌ని పోలిన వ్యవస్త (operating system). ఇది ఉచితముగ లభించును - అంతర్జాలమునుండి ఉచితముగ దిగుమతి చేసుకొనవచ్చును. ఆధునిక సంఘమున అవసరమైన అన్ని పరికరములు కలిగిన సంపూర్ణ వ్యవస్త. ప్రత్యేకము(stand-alone system)గ లేక ఇతర విధానము(dual/multi-booting system) లతో సహచారిగ అమర్చుకొన వచ్చును.
బీఎస్‌డి మూడు రూపములలో లభించును- ( ఫ్రీబీఎస్‌డి, నెట్‌బీఎస్‌డి, ఓపెన్‌బీఎస్‌డి). వీటిలో ఫ్రీ బీఎస్‌డి ఎక్కువ ప్రసిధ్ధి గాంచినది. నెట్ బీఎస్‌డి ప్రధానముగ ఇతర సామగ్రులలో అమర్చబడిన సామగ్రు (embedded devices)లలో ఎక్కువగ వాడబడుచున్నది. ఓపెన్ బీఎస్‌డి కూడ ఫ్రీబీఎస్‌డి వంటిదే - కాని రక్షణ - ఆత్మ రక్షణ (security)లపై ఎక్కువ మొగ్గు చూపించుచుండును. కనుక అంతర్జాలమునకు సంబందించిన వారికి - సంబందించిన వ్యవహారములకు ఎక్కువ ఉపయోగకరమైనది.
తక్కిన రెండు రూపముల కంటె ఎక్కువగ వాడబడుటచేత సామాన్యముగ ఫ్రీబీఎస్‌డి ఎక్కువగ పేర్కొన బడును. కాని ఫ్రీబీఎస్‌డినకు వర్తించు విషయములు తక్కిన వాటికి సమానముగ వర్తించును.
ఫ్రీబీఎస్‌డి లైనక్‌స్ నకు విభిన్నమైన పధ్ధతిలో - ఒక కేంద్రీక్రతమైన సంఘము (centralised body)చే నిర్వాహింప బడుచున్నది. ఇందు రెండు తెగలున్నవి- 1. సుస్థిరమైనది(stable), 2. పరిశొదనమౌతున్న అత్యాధునివమైనది(latest-cutting edge). సుస్థిర రూపము(stable version)లో పరిక్షింపబడి, నిర్ధారణ పొందిన(verified and tested software) పరికరములే యుండును. అత్యాధునిక రూపములలో పరిశోధనలో నున్న పరికరములు కూడ అమర్చబడును.
నిర్వహణలో, అమర్చుటలో, వ్యవహరించు పధ్ధతులలో చిన్న చిన్న బేధముల తప్ప - లైనక్‌స్, బీఎస్‌డిలు ఒకే సిధ్ధాంతము, ఆశయము, ప్రధాన అంశములు కలిగినవి. లైనక్స్కైన , పరికరములు - (packages) tar.gzరూపమైన - ఫ్రీబీఎస్‌డి యందు కూడ అమర్చుకొనవచ్చును. లైనక్‌స్ నకు వర్తించు అన్ని పరికరములు-(Packages) ఫ్రీబీఎస్‌డి యందు (చిన్న చిన్న మార్పులతో) అమర్చుకొనవచ్చును. లైనక్‌స్ కైన సూచనలు - చిన్న చిన్న మార్పులతో- బీఎస్‌డినకు కూడ వర్తించును. లైనక్‌స్ కైన ఆదేశములు, చిట్కాలన్నియు బీఎస్‌డిలకు వర్తించును.
విభాగము తెలుగు ఆంగ్లము తెలుగులిపిలేదు