Bhimalapuram.co.in

లైనక్‌స్ తో పరిచయము -ఆదేశములు[commands]

ఆంగ్లము తెలుగులిపిలేదు

లైనక్‌స్‌లోని ఆదేశములన్ని ఆంగ్లమున - కాపిటల్ కాని అక్షము[a నుండి z]ల నుండును. ఆదేశమునకైన పదములు కొన్ని అక్ష్రము మాత్రము గలవి - లేక క్లుప్తి కరింపబడినవి. ఉదా|| "move" నకు బదులు " mv", "COpy In Out" నకు బదులు - "cpio", "copy" నకు బదులు "cp" వాడబడును. అనేక ఆదేశములను - ప్రతి అదేశాంతమున ";" తో ఒకే వాక్యములో ఇవ్వ వచ్చును. ఉదా|| '" pwd;ls;gzip abc.txt; ls -lh;". ఒక ఆదేశము చే వచ్చు ఫలితమును -"|", "<", ">", వంటి చిహ్నముల సహాయముతో ఇతర ఆదేశముల ఉపయోగమునకు పంప వచ్చును.

ఎక్కువగ వాడబడు లైనక్‌స్ ఆదేశములు- వాటి ఉపయోగములు

COMMAND MEANING AND REMARKS
ఆదేశము అర్థము-వివరములు
1. ls list. విభాగములోని పత్రముల జాబితా నిచ్చును.
2. ls -llist long. విభాగములోని పత్రముల జాబితా - వివరములతో ఇచ్చును.
3. cp copy. పత్రమును - మరొక స్థలములో - మరొకపత్రములో నకలు చేయును.
4. cd change directory. వ్యవరించు విభాగమునుండి కదులును. కోరిన విభాగమునకు కదలిక కలుగును.
5. mvmove. సంపుటమును/విభాగమును పేర్కొన్న స్థలమునకు/విభాగమునకు/సంపుటమునకు కదలించును.
6. pwdpresent working directory. ప్రస్తుతము వ్యవహరించుచున్న విభాగమును చూపించును.
7. rmremove. పేర్కొనబడిన సంపుటమును శాశ్వతముగ తొలగించును.
8. rmdirremove directory. పేర్కొనబడిన విభాగమును - ఖాళిగ యున్నచో - శాశ్వతముగ తొలగించును.
9. mkdirmake directory. పేర్కొన్న క్రొత్త విభాగమును కల్పించును.
10. catసునాయాసముగ ప్రవహించి అంతముననుండు భాగమును మాత్రము చూపించును.
11. df disk free. హార్డ్ డిస్‌క్, సీడి, డీవీడి, పెన్ డ్రైవ్ వంటి మాధ్యములలో నున్న ఖాళి స్థలము - పరిమాణమును తెలుపును.
12. head text filter. సంపుటము ప్రారంభమునుండి పేర్కొన బడిన పంక్తులను చూపును.
13. man manual pages.టిప్పణి - ముఖ్యమైన - అవసరమైన - ఆ వ్యవస్తలో అమర్చబడిన వసతుల [applications] - వివరములను ప్రదర్శించును. వాటిని నడుపుటకైన వివరముల నిచ్చును.
14. su substitute user. పేర్కొనబడిన యితర కార్యకర్త పని
చేసుకొనుటకు [సరైన సంకేతము ఇచ్చిన తరువాత] వీలు కల్పించును. ఏ కార్యకర్తల పేరు లేనిచో వ్యవస్త
ఎజమాని "root" పని చేసుకొనుటకు [ సరైన సంకేత పదము ఇచ్చిన తరువాత] వీలగును.
15. tail text filter. సంపుటము అంతమునుండి పేర్కొన బడిన పంక్తులను చూపును. పంక్తుల సంఖ్యలను తెలపని యెడల 10 పంక్తులను[ఆంత్య భాగమునుండి] చూపించును.
16. tarTapeArchive. సులువుగ బదిలపరచి కావసినప్పుడు మరల వాడకమునకు వీలగు రూపమున - పేర్కొన్న/ఎన్నుకొన్న సంపుటములను- [పత్రములు, చిత్రములు, వ్యాసములు], విభాగములను ఒక విశాల సంపుటమున నకలు చేయు విధానము.
17. trtransliterate. ఆంగ్లమున అక్షరముల శ్రేణి కోరినట్టు మార్పిడి చేయును A-Z లేక a-z.
18. wcword count. పేర్కొనబడిన సంపుటమున కోరినట్టుగ అక్షరములు లేక పదములు లేక పంక్తుల సంఖ్యలను వెల్లడించును.
19. chmodchange permissions. సంపుటము/పత్రము /విభాగములకు సంబంధించిన అనుమతులలో సవరణలు/మార్పులు చేయును.
20. cutdelete. ఇవ్వబడిన స్థానములోని అక్షరములు/సంఖ్యలను లేక ఇవ్వబడిన నిలువు వరుసలను తొలగించును.
21. dudisk usage. వ్యవస్త[operating system]లో హార్డ్ డిస్‌క్ , సీడి, డీవీడి, పెన్ ద్రైవ్ వంటి మాధ్యములలో నుపయోగింపబడిన పరిమాణమును తెలుపును.
22. findfind. సూచించిన పదములను/సంపుటములను ప్రస్తుతము వ్యవహరించుచున్న విభాగములోఅన్వేషించి, కనిపించినచో వివరములు తెలియ జేయును.
23. grepglobal regular expression parse. సంపుటమున సూచింపబడిన రూపము గల పదములను/సంఖ్యలను చూపించును.
24. gzipGNU zip compression. సూచింపబడిన సంపుటము/విభాగమును - gzip పధ్ధతి ప్రకారము - సంక్షిప్తముగ/క్లుప్తముగ చేయును.
25. lessPrevents scrolling. పొడవైన వ్యాసము- సంపుటములో ముందు, వెనక ఇరువైపుల కదలికలతో కావలసిన భాగమును మాత్రము చూచుటకు వీలు కల్పించు ఆదేశము.
26. morePrevents scrolling. పొడవైన వ్యాసము-సంపుటములో నొక వైపు - ముందు వైపు - మాత్రము కదలికతో కావలసిన భాగమును మాత్రము చూచుటకు వీలు కల్పించు ఆదేశము.
27. passwdగుర్తింపుకు ఇవ్వబడు సంకేత పదమును మార్చుకొనుటకైన ఆదేశము.
28. passwd [user-id]యజమాని[root] తప్ప యితర కార్యకర్తల గుర్తింపుకు ఇవ్వబడిన సంకేత పదమును యజమాని మార్చుటకు ఇచ్చు ఆదేశము. passwd xyz అను ఆదేశము xyz అనబడు కార్యకర్తకైన సంకేత పదమును మార్చుటకు వీలు కల్పించును.
29. sedStreamingEDitor. ఈ పరికరముతో సంపుటమున వివిధ భాగములో ఒక ఆదేశముతో మార్పులు/సవరణలు చేసుకొన వచ్చును.
30. bcbackground calculator. కాల్కులేటర్ ప్రారంభించుటకైన ఆదేశము.
31. nano nano editor. nano అను పేరు గల editor ప్రారంభించుటకైన అదేశము. nano editorలో వ్యాసము వ్రాయ[type] వచ్చును; ఇతరస్థములనుండు పత్రములను నకలు చెసుకొన వచ్చును; తుదకు తయారైన విషయములను తగిన పేరుతో బదిల పరచుకొన వచ్చును. అవసైమన చో కావలసిన సంపుటములలో "అతికించి" [ నకలు చేసుకొని] బదిల పరచుకొన వచ్చును.
32. vim vim editor. చాల విశిష్టత గల vim editor ప్రారంభించుటకైన అదేశము. vim editor లో వ్యాసము వ్రాయ[type] వచ్చును; ఇతరస్థములనుండు పత్రములను నకలు చెసుకొన వచ్చును; తుదకు తయారైన విషయములను తగిన పేరుతో బదిల పరచుకొన వచ్చును. అవసరమైతే కావలసిన సంపుటములలో "అతికించి" [ నకలు చేసుకొని] బదిల పరచుకొన వచ్చును.
33. gedit GNU Editor. Opens geditor. ప్రతి లైనక్‌స్ విధానములోను అమర్చబడియుండు geditor ప్రారంభించుటకైన ఆదేశము. vim, nanoలలో నుండు అన్ని సదుపాయములు గల geditorన మరికొన్ని అదనపు సౌకర్యములు గలవు.
34. mkisofsసీడి, దీవిడిల లో అమర్చుకొనుటకు వీలుగ తగిన ప్రతిబింబ రూపముగ కావలసిన విషయములను తయారు చేయు ఆదేశము.
35. playటోటెం/ ఇతర ప్లేయర్ ద్వార ఆగ్, ఫ్లాక్ రూపములలో వున్న గాత్ర/సంగీత/సంభాషన గల సంపుటములను వినుటకు, avi, ogv రూపములో వున్న గాత్రముతో/సంగీతముతో గూడిన చలనచిత్రను వినుటకు/చూచుటకు వాడబడు అదేశము.
36. awkAwk or gawk utility. సంపుటమున/వ్యాసమున ఒక ఆదేశముతోనే అనేక మార్పులు, సవరణలు చేసుకొను వసతి గల విధానము.
37. dmesgDisplay Booting Message. వ్యవస్త ప్రారంబమగునప్పుడు జరుగు ప్రక్రియల చరిత్ర - కావలసినచో ఒక పత్రముగ బదిల పరచుకొన వచ్చును.
38. killTerminate the process.సూచించిన ఒక /కొన్ని లేక అన్ని ప్రక్రియలను నిలిపి వేయును.
39. hostnameName of the system. వ్యవస్త[operating system]కు ఇవ్వబడిన పేరును చూపించును.
40. exitTerminate. ప్రస్తుతము జరుగుచున్న ప్రక్రియను నిలిపి వేయును.
41. uptimeప్రస్తుత సన్నివేశము[present session] ప్రారంభమైనప్పటినుండి ఈ ఆదేశము ఇచ్చినప్పటి వరకైన సమయమును తెలుపు ఆదేశము.
42. date Time and Date. దినము, సమయములను - [వారము, నిమిషములు, క్షణములు, సంవత్సరము వంటి వివరములతో] - చూపించును.
43. dumpUtility for taking backup. ఈ పరికరముతో - ఈ ఆదేశముతో - వ్యవస్త లోని లేక కావలసిన విభాగములలోని విషయముల/వివరముల నకలు తీసికొని బదిల పరచుకొన వచ్చును.
44. rsyncUtility for taking backup. ఈ పరికరము/ ఆదేశముతో - వ్యవస్త లోని లేక కావలసిన విభాగములలోని విషయముల/వివరముల నకలు తీసికొని కావలసిన స్థలమున - ఈ వ్యవస్థలోనే లేక ఇతర వ్యవస్థలలో బదిల పరచుకొన వచ్చును.
45. nlnumber lines. సంపుటము/పత్రములోని విషములను సంఖ్యలు గల పంక్తులతో చూపించును.
46. splitcut the file. సంపుటమును/పత్రమును చిన్న భాగములుగ విభజించును.
47. colColumn. నిలువు వరుసలతో వున్న సంపుటము/పత్రమును సాదారణ రూపము గల గద్యముగ మార్చును.
48. tree వ్యవస్త- లేక విభాగముల లోని సంపుటములను వంశావళి రూపమున ప్రదర్శించును..

ఈ ఆదేశములకు అనేక ఉపసర్గములు గలవు, సంబంధించిన ఆదేశము ను "-help" "సహయము" అను పదముతో ఇచ్చిన లేక "man" లేక "info" అను పదములతో జారి చేసిన - ఆ ఆదేశమునకు వర్తించు సూచనలు, వివరములు లభించును. "ls -help" అను ఆదేశము జారి చేసిన lsనకు సంబందించిన సూచనలన్ని కనబడును. "man tar" లేక "info tar" అను ఆదేశములు "tar" నకు సంబందించిన వివరములను చూపును .

Valid XHTML 1.0 Transitional

Valid CSS!