Bhimalapuram.co.in
Free Software/Free software For Telugu
Software for compression

ఆంగ్లము తెలుగులిపిలేదు

లైనక్‌స్‌న దస్త్రముల/గణాంకముల పరిమాణమును తగ్గించుటకు (క్లుపపరచుటకు/తగ్గించుటకు) వసతులున్నవి.

జీజిప్:: ఇవ్వవలసిన ఆదేశము: "gzip xyz.html". దస్త్రము gz అను ప్రత్యయముతో ("xyz.html.gz")పరివర్తన చెందును. నిలుపుకోవలసినచో "-k" అక్షముతో ఆదేశము జారిచేయవలెను. ఆదిరూపమును పునరుద్దరించుటకు కావసిన ఆదేశము: ఫలితము: ఆదిరూపము, క్రొత్త రూపము గల రెండు దస్త్రములు తయారగును. ఆదిరూపమును పురుద్దరించుటకు కావసిన ఆదేశము: పూర్తి వివ్రములకు www.gnuDOTorgన గల టిప్పణులను చూడగలరు.

బీజిప్2:బీజిప్2 జీజిప్ కన్న మెరుగైనది. ఇవ్వవలసిన ఆదేశము: "bzip2 xyz.txt". దస్త్రము bzip2 అను ప్రత్యయముతో ("xyz.txt.bz2") అని పరివర్తన చెందును. ఆది రూపము నిలుపుకోవలసినచో "-k" అక్షముతో ఆదేశము జారిచేయవలెను. ఫలితము: ఆదిరూపము, క్రొత్త రూపము గల రెండు దస్త్రములు తయారగును. ఆదిరూపమును పునరుద్దరించుటకు కావసిన ఆదేశము: "bzip2 -d xyz.txt.bz2" or "bunzip2 xyz.txt.bz2". పూర్తి వివ్రములకు సంబందిత టిప్పణులను చూడగలరు.

xz: xz zip బీజిప్2 జీజిప్‌ల కన్న మెరుగైనది. ఇవ్వవలసిన ఆదేశము: "xz xyz.txt". దస్త్రము xz అను ప్రత్యయముతో ("xyz.html.xz")అని పరివర్తన చెందును. ఆది రూపము నిలుపుకోవలసినచో "-k" అక్షముతో ఆదేశము జారిచేయవలెను. ఆదిరూపమును పునరుద్దరించుటకు కావసిన ఆదేశము: "xz -d xyz.txt.xz". పూర్తి వివ్రములకు wwwDOTtukaaniDOTorgన గల టిప్పణులను చూడగలరు.

పెద్ద దస్త్రముల వాడకమునకు rzip (వారి స్థావము httpsCOLON//rzipDOTorg), lrzip( వారి స్థావము httpsCOLON//wikiDOTarchlinuxDOTorg), lzip( వారి స్థావము wwwDOTnongnuDOTorg) వంటి ఉచిత పరికరములు ఉన్నవి.

జీజిప్, బీ2జిప్, xzజిప్ - ప్రస్తుతము వెలువడుతున్న అన్ని లైనక్‌స్‌లలో అమర్చబడుచున్నవి. వీటికైన టిప్పణులు "man pages", "info", "--help" అని వివిధ రూపములతో అమర్చబడుచిన్నవి.

మా అనుభవము: ఈ మూడు వసతుల(utilities)లో xz zip ఎక్కువ సమర్థవంతమైనది. వాడుకలో జీజిప్ ఎక్కువగుటచే మెము జీజిప్‌ను వాడవలసివచ్చెను. 15000 పంక్తులున్న 1.7 MB పరిమాణము గల ఒక పెద్ద వ్యాసమును(file) ఈ మూడు పరికరములను ఉపయోగింపగ వచ్చిన ఫలితములు: GBS1.txtమూలము - 1.7M.B; జీజిప్ రూపము -GBS1.txt.gz -364KB; Bizip2రూపము - 231KB; xz రూపము 248KB -(వాడకము -ప్రమాణిక నియమముల అనుసారము Under standard/default terms)

చిత్రములు: సవరణ/క్లుపతపరచుటకు Okular వాడబడినది. JPG రూపమన ఉన్న చిత్రమలను Okular ద్వార అవసరమైన కొలతలకు తగ్గించి png రూపమున మార్చబడినది. GIMPలోని indexing/grey colours లేక posterising- colours వసతులతో చిత్రమలను తగిన కొలతలకు తగ్గింపబడినవి.

Back To Directory ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!