Bhimalapuram.co.in

List of Linux Distros

ఆంగ్లము తెలుగులిపిలేదు

గమనిక ఈ వ్యాసమునకు స్ఫూర్తి : వికిపీడీ లోని వ్యాసము. వికిపీడీ వారికి మా కృతఙ్ఞతలు తెలుపుచున్నాము..

లైనక్‌స్‌లో చాల రకములు గలవు. ఒకొక రకము "distro" అనబడును. మనుష్యులకు మెదడున్నట్టు లైనక్‌స్‌ వ్యవస్థకు ప్రాణము పోయు భాగమె "kernel". వ్యవస్థలోని వివిధ భగములను, సంబంధిన సామగ్రి[hardware]ని, ఇవ్వబడు పనులను సరైన పద్ధతిలో చేయుటకు కావసిన సూత్రములే "kernel". ఇతర అవయవములు: 1. GNU, KDE పద్ధతులకు సంబంధించిన packageలు. 2. వివిధ ఆదేశముల గురించి, ఇతర సంబంధిత విషయముల గురించి తయారైన టిప్పణులు ["Documentation"] . 3. అన్ని యంత్రములను సరైన మార్గములో నడుపుటకు కావలసిన సూత్రములు - "drivers", అదనముగ అమర్చబడిన వసతులు - "applications". వాణిజ్య రంగమున గిద్దంగుల వలె - packagesలు అంతర్జాలమున వుంచబడు - స్థావరములు - "repositories/Mirrors" గలవు. అక్కడనుండి కావసిన packagesలను దిగుమతి చేసుకొన గలము.

ఎక్కువ వాడకములో వున్న రకములు - "distros": వందలాది రకములైన లైనక్‌స్‌ "distros" వ్యవహారమున గలవు. ఇవన్ని కొన్ని ప్రధాన రకములనుండి చీలిపొయినవి. ప్రత్యేక అవసములకై , భిన్నాభిప్రాయములచే, వ్యక్తికత అవసరము[ Desktop]లకై , బృందములు [Master machines- "servers"]లకై , విఙ్ఞానరంగమునకై , వ్యాపార సంస్థలకై - శఖోప శాఖలుగ చీలి పోయినవి. సంపూర్ణ సేవాభావము గల వర్గములచే నడుచు రకములు ["maintained by group of volunteers"] - ఫెడోరా, స్లాక్‌వేర్, ఆర్‌చ్ లైనుక్‌స్. రెడ్ హాట్, సూసే, ఉబుంటు వంటివి వాణిజ్యపరము[ commercial/support-by-payment-basis]గ చెలావణీ అగుచిన్నవి. వాణిజ్య పరమైనను - సెవాబృందముల చే నడుపబడు రకములైనను - ఇవన్ని ఒకే ఆదర్శముపై ఆదారపడినవి. దిగుమతి, అమర్చుకొనుట - వంటి విషయములలో కొద్ది తేడాలు కనిపించిన అన్ని లైనక్‌స్‌ రకములలోని పద్ధతులు, ఆదేశములు, పని తీరు ఇంచుమించు ఒకటే.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!