Bhimalapuram.co.in
(జీపీఎల్‌తో ఇంచుమించు సమానమైన) ఓపెన్ ఫోంట్ లైసెన్‌స్‌తో ఉచితముగ లభించు తెలుగు ఖతులు

ఆంగ్లము తెలుగులిపిలేదు

>సంయుక్త ఆంధ్ర ప్రదేష్ ప్రభుత్వము సిలికాన్ ఆంధ్ర వారి ఉమ్మిడి ప్రయత్నముల ఫలితముగ అవసరములకు తగినటుగ ఎన్నుకొనుటకై వివిధ రూపములు గల చాల ఖతులు ఉచిత ఉపయోగము/దిగుమతికి ఓపెన్ ఫోంట్ లైసెన్‌స్‌ల నియమముల ననుసరించి విడుదల చేయబడినవి. ఓపెన్ ఫోంట్ లైసెన్‌స్‌ గ్ను జీపీఎల్ లైసెన్‌స్ వలె ఉచిత పంపిణికి (వివరములలో కొద్ది భేదములున్నను) సుముఖమైన నిబంధనలతో కూడినది. లోహిత్ , వేమన, పోతన ఖతులు గ్ను జీపీఎల్ లైసెన్‌స్ల నిబంధనల ననుసరించి దిగుమతి/పంపిణికి విడుదలైనవి.

ఈ ఖతులు వివిధ రూపములలో వెలువడినవి. కొన్ని ఖతులలో ఆంగ్ల లిపి, అంతర్జాతియ సంఖ్యలుతో అమర్చబడినవి. ఆంగ్ల లిపిని, అంతర్జాతియ సంఖ్యలను కూడ అమర్చుటచే ఈ ఖతులతో టెక్‌స్ విధానమున తెలుగులోను (ఆంగ్ల భాషలో వున్నట్టే) అత్భుతమైన రచనలు తయరు చేయగలము. ఏ కోణమున చూసినను అత్యున్నతమైన పీడీఎఫ్ పత్రములు, పీడీఎఫ్ రూపమున వ్యాసములు, గ్రంధములు రచింపగలము.

ఈ ఖతులను ఇక్కడనుండి దిగుమతి చేసుకొన గలరు. కొన్ని ఖతులలో ఆంగ్ల లిపి అమర్చ బడలేదు.

ధూర్జటి, గిడుగు, గురజాడ, లక్కిరెడ్డి, మల్లన్న ఖతుల రూపములను ఈ చిత్రములోను, మండల్-రెగులర్, నాట్‌స్, ఎంటీర్, పెద్దన ఖతుల రూపములను ఈ చిత్రములోను, పొన్నాల, పోతన2000, రామభద్ర, రామరాజ, రవి ప్రకాష్ ఖతుల రూపములను ఈ చిత్రములోను, శ్రీకృష్ణదేవరాయ, సూరన్న, సురవరము, తెనాలిరామకృష్ణ, తిమ్మన ఖతుల రూపములు ఈ చిత్రములోను చుడగలరు.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!