Bhimalapuram.co.in

లైనక్‌స్‌తో పరిచయము

ఆంగ్లము తెలుగులిపిలేదు

లైనక్‌స్ ఉచితముగ/స్వల్ప వ్రయము లేక వ్యయమేలేకుండ- చట్ట పరముగ అమర్చుకొనుటకు వీలైన ఒక సంపూర్ణ వ్యవస్త(operating system). ఇది ఎంఎస్‌విండోస్‌నకు భిన్నమైనది. లైనక్‌స్ మూల సూత్రము(source code)లను కూడ చట్టపరముగ ఇతరులకు ఇవ్వ వచ్చును- పంపిణి చేయవచ్చును. ఎంఎస్‌విండోస్ వలె ఎక్కువ ఖర్చైనది కాదు.

సునాయాసముగ అమర్చ గలరు. ఉపయోగము గురించి నేర్చుకొనుట - చాల తేలిక. ఇది సుస్థిరమైనది. లిఖిత రూపముగనైన/చిత్ర రూపముననైన అమర్చ బడిన ఆదేశములతో గాని - అమర్చుకొనవచ్చును/ఉపయోగింపవచ్చును. అనేక కార్యకర్తలు అనేకకార్యక్రమములను ఒకే సమయమున నిర్వహింప వచ్చును. ఆదేశములన్ని ఆంగ్ల వర్ణమాలలో "చిన్న" (non-Capital)అక్షరములతో ఇవ్వబడును. ఇవి తరచుగ పూర్తి పదములు కాక పద్ములలోని కొన్ని అక్షరములతో ఇవ్వ బడును. ఉదాహరణకు "copy" బదులుగ "cp", "change directory" బదులుగ "cd", "move" బదులుగ "mv" అను ఆదేశములు జారిచేయబడును.

లైనక్‌స్ బ్రహ్మాండమైన - ఆధునిక ప్రపంచమున అవసమైన అన్ని కార్యక్రమములను నిర్వహింపగ గల శక్తి - సామర్థ్యము వున్న వ్యవస్త. చాల వికాసమొందినది. అన్ని రంగములకు - వాణిజ్యము, పరిశ్రమలు, విద్య, విఙ్ఞానము వస్తువులుల వుత్పత్తి లేక ఇతర కార్యక్రమములకు తగినది. చిత్రములు, చలన చిత్రములు, క్రీడలు, సంగీతము- సంభాషణ, ముద్రణ - అన్ని కార్యాలములకు సంబంధించిన అన్నిరకములైన పనులేవైన - వాటికి తగిన వనరులు(packages)గల వ్యవస్త.

ఇందలి గ్రాఫిక్ యూసర్ ఇంటెర్‌ఫేస్ నేర్చుకొనుటకు చాల సులువైనది. ఎంఎస్‌విండోస్‌లోని పధ్ధతులకన్న సులువైనది, మెరుగైనది.

లైనక్‌స్‌లో తగిన/సరైన(appropriate) నియమములు/నిబంధనలు/నిషేదములు అమర్చబడినవి. ఏ కార్యకర్తలైన - అవసరమైనంత, అనుమతి ఇవ్వబడినంత - వరకే వ్యహరింప గలరు. వ్యవస్త యొక్క యజమాని/సూత్రధారి("root")కి మాత్రమే వ్యవస్తలో మార్పులు, చేర్పులు చేయుటకు వీలగును. ఇతరులు - వారి పరిమితి వరకే కార్యక్రమములు చేసుకొన గలరు. ఒక భాగము ఏకారణము చేతనైన - విఫలమైన - ఆగిపోయిన - ఇతర భాగములు ఆ కార్యములను కొన సాగింప గలవు. జరుగుచుండు కార్యక్రముల నకలును ఎప్పటిపక్కుడు తీసికొని బదిల పరచుకొను పధ్ధతులు ("mirroring")- ప్రతి క్రియకు ప్రతి బింబము సృష్టించుట, " RAID"- (ప్రతి క్రియను ఒకటి కంటే ఎక్కువ మాధ్యములలోను అమర్చుకొనుట,) లైనక్‌స్‌న గలవు. కనుక ఎటువంటి కారణములచేతనైన కార్యక్రమములు ఆగిపోయిన లేక విఫలమైనను - ఆ కార్య క్రమములను ఆటంకము/అంతరాయము లేకుండ తిరిగి నడుపు కొన వచ్చును.

లైనక్‌స్ ప్రత్యేకముగ లేక ఇతర వ్యవస్తలతో సహచారిగ అమర్చుకొన వచ్చును. ఏ కారణముచేతనైన లైనక్‌స్ శాశ్వముగ వ్యవస్త (operating system)లో అమర్చుకొనలేనప్పుడు- లేక అత్యవసరముగ కార్యక్రమములకు అవసరమైనప్పుడు - తాత్కాలిక రూపమున లైనక్‌స్‌ను ఉపయోగించుకొన వచ్చును. లైవ్‌సీడిలతో ప్రస్తుతమున్న వ్యవతను ప్రభావితము చేయకుండ లైనక్‌స్ ను వాడ వచ్చును.

అనేక రకములు (distributions-"distros")వ్యవహారమున ఉన్నవి. కావలసిన పని తీరును - కార్య క్రమములను దృష్టిలో వుంచుకొని వేరు వేరు రకములు కల్పింప బడినవి. వీటిలో చిన్న చిన్న తేడాలు వున్నను - అదేశములు, పధ్ధతులు ఇంచుమించు ఒకటే.

అమర్చు పధ్ధతిలోని నైపుణ్యతచేత- లైనుక్‌స్ చాల సుస్థిరమైనది. సామాన్య కార్యక్రమములకు సామాన్య కార్యకర్తగ పనులను కొన సాగించుట, అవసరమైన ప్రక్రియలనే ప్రాభించుట, అవసరములేని- పూర్తియయిన ప్రక్రియలు ఎప్పటికప్పుడు నిలిపి వేయుట, సంకేత పదము(password)లను తరచుగ మార్చుట, ఏ కార్యకర్తకైన అవసరమైనంత వరకే ప్రవేశమిచ్చుట - వంటి మరికొన్ని మార్పులు - జాగ్రతలు అవలంభించి - వ్యవస్థ భద్రతను, వేగమును పెంచు కొన వచ్చును. వివరములకు ఆదేశములు , వనరులు - packages, సూచికల న్నింటిని చదవ గలరు.

లైనక్‌స్‌నకు సంబందించిన అన్ని విషయములపై wwwDOTtldpDOTorgన సూచికలు, టిప్పణులు, ఇతర గ్రంధములు లభించును.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!