Bhimalapuram.co.in
Linux Tools

ఆంగ్లము తెలుగులిపిలేదు

చాల పెద్ద, క్లిష్టమైన కార్యక్రమములను ఒక ఆదేశముతో లేక ఒక దశలోనె చేసుకొనగల వసలతులు లైనక్‌స్‌లో ఉన్నవి. ఆదేశములు చేర్పులు/కూర్పులు కలిగి ఉండుటచే ప్రత్యేక/విశేష పరిస్థితులకు సరిపోగల సామర్థ్యమున్నవి.

1. Sort (క్రమబద్దీకరించుట):సుదీర్ఘమైన పట్టికలు - ఎంత పొడవైన/ఎంత పరిమాణముగలవైనను - సంఖ్యలవారిగ(1-9) లేక అక్షముల అదారముగ (అ-హ)వేరుపరచ వచ్చును/క్రమబద్ధముచేయ వచ్చును/ క్రోడీకరంపవచ్చును. పంక్తులలో ఒకటి కంటే ఎక్కువ భాగము(fields)లున్నచో, వివిద ప్రమాణముల(criteria/basis) ప్రకారము వేరుచేసుకొన గలము.

2.ఇమేజ్‌మాజిక్ (ImageMagick): సుదీర్ఘమైన పట్టికలు - ఎంత పొడవైన/ఎంత పరిమాణముగలవైనను - సంఖ్యలవారిగ(1-9) లేక అక్షముల అదారముగ (అ-హ)వేరుపరచ వచ్చును/క్రమబద్ధముచేయ వచ్చును/ క్రోడీకరంపవచ్చును. పంక్తులలో ఒకటి కంటే ఎక్కువ భాగము(fields)లున్నచో, వివిద ప్రమాణముల(criteria/basis) ప్రకారము వేరుచేసుకొన గలము.

3.జింప్ (Gimp): చిత్రములకై ప్రత్యేకముగ సృష్టింపబడినది. ఆకారములో (పెద్దగ చేయుట/చైన్నగచేయుట)మార్పు, రూపములో మార్పులు, రూపములో నాణ్యత తగ్గకుండ పరిమాణము తగ్గించుట, చిత్రములలో వచనములు సమకూర్చుట - అని అసంఖ్యాగమైన మార్పులు/ప్రక్రియలు/పనులు చేసుకొనవచ్చును. అన్ని లైనక్‌స్‌లలోను ఈ వసతి(software) అమర్చబడియుంటుంది. కావలసినచో wwwDOTgimpDOTorg అను వారి స్థావరమునుండి అత్యాధినిక రూపమును దిగుమతి చేసుకొనవచ్చును. దీనినిపోలిన మరొక సాధనము ఆక్యులర్.

4.జీఎడిట్ లేక నానో (Gedit or nano): gedit అను ఆదేశముతో జీఎడిటర్ తెరపై తెరుచుకొనును. వ్యాసము/పత్రములను అతికించి, కావలసిన చేర్పులు మార్పులు చేసుకొని బదిలపరచుకొనవచ్చును. యూటీఎఫ్6 - అంటే భారతీయ భాషలను చూపగలదు. నానో ఎడిటర్ చాలసులువైన పరికరము- కాని ఆంగ్లేతర లిపులను సరియైన రూపమున చూపు సామర్థ్యము లేదు.

5.అపాచీ అనబడూ హెచ్‌టీటీపీ (Apache Web Server): అపాచీ అని తరచుగ పిలవబడు హెచ్‌టీటీఫి సెర్‌వర్ లైనక్‌స్‌లో తరచుగ అమర్చబడియుంటుంది. ఆట్లు లేనిచో వారి స్థావరము(httpdDOTapacheDOTorg)నుండి దిగుమతిచేసుకొని అమర్చుకొనగలరు. భిన్నమైన లైనక్‌స్‌రూపములలో వ్యహారమున చిన్న చిన్న తేడాలున్నను, ముఖ్యమైన సిద్ధాంతములు/వ్యవహారశైలి -ఒకటే. దీనితో అంతర్‌జాలమ్న వెబ్‌సైట్ సృష్టించుకొనవచ్చును. వెబ్‌సైట్ లేకపోయినను, అంతర్‌జాలమునకైన వ్యాసములు/దస్త్రములు/ఇతర విషయమునలు సామర్థ్యము/లోపములను పరిక్షించి, సవరించుకొనవచ్చును.

6.బదిలపరచుట/పునరుద్దరించుట (Back up/recovery):వ్యవస్థ(SYSTEM)న గల పత్రములు/దస్త్రములు/ఇతర విషయములను ఎప్పటిపక్కుడు బదిలపరచుకొనుటకు ఉచితముగ లభించి వసతులు గలవు. అమాన్‌డా, అఋసిన్‌ఖ్,బాక్అప్‌పీసీ, క్లోన్‌జిల్ల వంటి వసతు(utilities)లను వాడి ఎప్పటిపక్కుడు వ్యవస్థలలోని దస్త్రములు/ఇతర విషయములను బదిలపరచుకొనవచ్చును. ఏమైన విపత్తు/ఆటంకము కలినప్పుడు, అన్ని దస్త్రములను/విషయములను పునరుద్ధరించి, సంస్థను యథావిధిగ నడుపుకొనవచ్చును.

7. గణాంకములు (Data bases):గణాంకములకు సంబంధించిన పనులకు ఉన్నతమైన పరికరములు/వసతులు గలవు. మైఎస్‌క్యూఎల్ లేక మరియాడీబీ ఎంత పెద్దైన- ఎంతక్లిష్టమైన పనులనైనను సునాయాసముగ నిర్వహింపగలవు.

8.క్లుప్తపరచుట (Compression tools)దస్త్రములు/వ్యాసములను చలనచిత్రములను క్లుప్తపరచుతకు జీజిప్, ఎక్‌స్‌జెడ్, వంటి పరికరములను వాడుకొనవచ్చును. చాల పెద్ద దస్త్రములను క్లుప్తపరచుటకు ఆర్‌జిప్, ఎల్అర్‌జిప్ వంటి వసతులు గలవు.ధ్వని,దృశ్యములకై ఆగ్గ్, ఫ్లాక్, జిం్‌ప్,ఆక్యులర్, గోస్ట్ స్క్రిప్‌ట్ వంతి వసతులు గలవు.

9.ధ్వని/దృశ్యములకైన పరికరములు (Audio/Video utilities): ధ్వని,దృశ్యములను నమోదు(record)చేసుకొనుటకు, బదిలపరచుటకు, వినిపించుటకు, వీక్షించుటకు విశిష్టమైన పరికరములు గలవు. ఇవీ ఉచితముగను, కావలసిన మార్గదర్శక టిప్పణులతో, అడాసిటి (వారి స్థావరము wwwDOTaudacityteamDOTorg నుండి) , Rosegarden (వారి స్థావరము wwwDOTtwocowsDOTcom నుండి), and Ardour (వారి స్థావరము wwwDOTardourDOTorgనుండి ) దిగుమతి చేయబడి తరచుగ వాడబడు వసతులు. ఈ వసతులు wwwDOTsourceforgeDOTnet, wwwDOTlinuxDOTsoftpediaDOTcom లనుండి కూడ దిగుమతి చేసుకొనవచ్చును. Byzanz (wwwDOTlinuxDOTdieDOTnet నుండి), kazam (wwwDOTpkgsDOTorg నుండి),Blender (wwwDOTblenderDOTorg నుండి) దిగుమతి చేసుకొనవచ్చును. వీఎల్సీ, ఎక్‌స్ఎంఎంఎస్ గ్‌జైన్ తరచుగ వాడబడు విశిష్టమైన దృక్ శ్ర్వణ పరికరములు. io gnu lainak^s(స్థావరము wwwDOTgnuDOTorg), dyne:bolic (స్థావరముwwwDOTdyneDOTorg) వంటి ప్రత్యేకముగ శ్ర్వణము/చలనచిత్రములైన లైనక్‌స్‌లు గలవు. గాత్రముతో కూడిన/గాత్రములేని చలన చిత్రములను వాటి మూల పరిమాణమునుండి 1/3 వంతు నుండి 1/5వ వంటు వరకు తగ్గించగల ffmpeg అను వసతి గలదు. చిత్రబింబముల సంఖ్యలను/ఆకారములను, ధ్వని పరిమాణములను కావలసినట్లు మార్చుకొని చాల ఎక్కువగ క్లుప్తపరచవచ్చును.

10.విశేషమైన/విశిష్టమైన పరికరములు (Advanced facilities): పెద్ద సంస్థల రక్షణకై- వారి కార్యక్రమములు అంతరాయము లేకుండ నడుచుటకు, విపత్తులు/ఆపదల తరువాత ఆటంకములు లేక తిరిగి కార్యక్రమములు జరుగుటకు విశెషమైన పద్ధతులున్నవి. Raid-Reduntant Array of Independent Discs(అదనముగ మాధ్యములను నడుపుట), బింబము-ప్రతిబింబము(mirroring)వంటి అదనపు చర్యలు, కార్యాచరణమును విడి-విడిగ పంచుకొనుట(LoadSharing) వంటి విధానములు చేపట్టి, సంస్థలు అనర్గళముగు సాగునట్టు చేసుకొనవచ్చును.

ఈ విషిష్ట వనరులు ఉచితముగ - విస్త్రుతమైన టిప్పణులతో- నిశ్స్వార్థమైన సహాయముతో లభించుచున్నవి.

విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు