Bhimalapuram.co.in

ఉచిత పరికరములు

ఆంగ్లము తెలుగులిపిలేదు

ఇంచుమించు అన్ని రంగములకు నాణ్యమైన గొప్ప వనరులు (software) - ఉచితముగ(free software) దొరకుచున్నవి. ఈ పరికరములు వ్యాపార రీత్యా విక్రయించబడు పరికరము(proprietory software)లకు ఏరీతిగ చూసినను తీసిపోవు. కొన్ని కోణములలో చూచిన ఇవి వ్యాపార రీత్యా విక్రయింపబడు పరికరముల కంటే మెరుగైనవి. వీటిని అంతర్జాలము (internet) నుండి దిగుమతి చేసుకొని అమర్చుకొన గలము.

ఉచిత పరికరముల కైన ప్రాధాన స్థావరములు

gnuDOTorg, linuxDOTorg, tucowsDOTcom, fsfDOTorg, freshmeatDOTnet, మఱియు sourceforgeDOTnet. పరికరములు కల్పించిన వారి స్తావరములు ఉదా|| - vlc -videolanDOTorg, Open Office - openofficeDOTorg, xz zipping - tukaaniDOTorg, ogg/ogv- theoraDOTorg, లైనక్‌స్‌వారి- ఫెడోరా, ఉబుంటు, క్నోప్పిక్స్, డెబీన్, సూసే, స్లాక్స్, పప్పి లైనక్స్ వంటి స్థావరములు.

వ్యవస్త(Operating system) : తాత్కాలికముగ/ఆకస్మికముగ వాడ తలచిన: - లైవ్‌సీడి వాడ వలెను. ఉన్న వ్యవస్త operating system/hard diskలు ప్రభావితము చేయబడవు. విశిష్టమైన లైవ్‌సీడిలలో పప్పి లైనక్స్ ఒకటి. ఇందు అన్ని రంగమునకైన పరికరములున్నవి. చాల వేగముగ పనులను నెరవేర్చు సామర్థ్యము వున్నది. చేసిన పనులను - USB drives/సీడి/దీవీడి/external hard diskలో బదిల పర్చుకొన గలరు. పూర్తి వివరములకు విటికై వచ్చు టిప్పణులను చూడగలరు. స్లాక్స్ - మరొక విశిష్టమైన లైవ్‌సీడి . దిగుమతి చేసే సమయముననే కావలసిన packageలను అమర్చుకొన వచ్చును. ప్రత్యేకమైన అవసరములకు livecdlistDOTcomన దొరకు పట్టిక నుండి ఎన్ను కొన గలరు.

శాస్వతముగ లైనక్స్ వాడు కొనుట: -

ప్రత్యేకముగ లైనక్స్ మాత్రమే లేక ఎంఎస్‌విండోస్/బీఎస్‌డీ/యునిక్‌స్‌లతో సహచారిగ అమర్చుకొన గలరు. ఎంఎస్‌విండోస్‌నకు దొరకు పరికరములన్నింటికి అదే తీరున (చాల వరకు వాటి కంటే మెరుగైన తీరున) ఫలితములిచ్చు వనరులు లైనక్‌స్‌నకు కూడ దొరకుచున్నవి. వీటి మూల సూత్రములు(source code) లభించుటవలన అవసరమైన చోట కావలసిన సవరణలు, మార్పులు చేసుకొన వచ్చును. సుదీర్ఘమైన టిప్పణులు , అంతర్జాలము దారా అవసరమైనప్పుడు దోహదము/సలహాలు దొరకుట చే లైనక్స్ అన్ని విదముల విశిష్టమైన operating systemముగ పరిగణింప పడుచున్నది. అన్ని రంగములకు - క్రీడ, సంగీత, చిత్ర, చలన చిత్ర, అంతర్జాల వ్యవహారములు, వివిద కార్యాలయములకు కావలసిన సదుపాయములు, ముద్రణ - మొదలగు అన్ని విషయములకు సరైనది. వివిద రకములైన లైనక్‌స్‌ల పట్టిక ఇక్కడ ఇవ్వబడినది.

ముఖ్యమైన ఆదేశముల పట్టికను చూడ గలరు. చాల వరకు ఈ అదేశములు ఎంఎస్‌విండోస్‌లోని అదేశములతో పోలికలు కలిగి యుండును. కనుక లైనక్‌స్ వాతావరణమున పని చేయుట చాల సులభము.

పరికరములు(Packages): చాల వరకు అన్ని రంగములకు సంబంధించిన పరికరములు system - సీడి/దీవీడిలలో/లైనక్‌స్‌తో దొరకును. అదనముగ - లేక ఇటీవలవిడుదలైన రూపము కావలసినచో అంతర్జాలమునుండి దిగుమతి చేసుకొన వచ్చును . వీటి పట్టిక ఇక్కడ ఇవ్వబడినది.

లైనక్‌స్‌ పని తీరును మెరుగు పరచూటకు చాల పధ్ధతులున్నవి. వీటి పట్టిక ఇక్కడ ఇవ్వబడినవి.

ఫ్రీబీఎస్‌డీ: లైనక్‌స్‌నకు వర్తించు ఆదేశములు, చిట్కాలు ఫ్రీబీఎస్‌డీ నకు వర్తించును. దీనికి కావలసిన పరికరములు- వనరులు- freebsdDOTorgన లభించును.

తెలుగులో లైనక్‌స్‌: లైనక్‌స్‌తో తెలుగులోను కావలసిన పనులు చేసుకొనవచ్చును. ఉచితముగ దొరకు తెలుగు ఖతులను దిగుమతి చేసుకొని , అమర్చుకొని వాడుకొనవచ్చును. తెలుగులిపితో geditor/nanoలను ఉపయోగింపవచ్చును. తెలుగులిపితో ఫైర్‌ఫాక్స్, క్రోంలలో వ్యాసములను, దస్త్రములను చూడ వచ్చును. మైఎస్‌క్యూఎల్తో లేక మరియాడీబితో తెలుగులిపిలోని పట్టికలలు, అన్ని రూపములనున్న సమాచారములతో కావలసిన క్రియలు/కార్యములు చేసుకొనవచ్చును.ఆంగ్లలిపి వలె తెలుగులిపితోను అన్ని క్రియలను నిర్వహింప వచ్చును. పేళ్తో తెలుగు వ్యాసములు/దస్త్రములలో/తో అన్ని కార్యములు/క్రియలు నిర్వహింపగలము. తెలుగు వ్యాసములను ఫెస్‌టివల్/ఫెస్‌టివల్-టి ద్వార వినగలము. టెక్స్‌లైవ్‌తో తెలుగులిపిలో ఎటువంటి వ్యాసము/గద్య/పద్య రచనలు/చిత్ర/చలన చిత్రము వున్న పుస్తకములనైన సృష్టింప గలము.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!