Bhimalapuram.co.in
సెడ్

ఆంగ్లము తెలుగులిపిలేదు

సెడ్ అనబడు streaming editor పత్రము/దస్త్రములపై ఒకే యత్నముతో ప్రక్రియను పూర్తి చేయును కనుక ఇతర పరికరముల కంటే వేగమంతమైనది. ఇతర ఎడిటర్‌స్ లోలేని వసతి సెడ్‌న గలదు. సెడ్ ఇతర పరికరములతో - దాని తరువాతైన లేక ముందైన చేరి పనిచేయగలదు. |, >, < వంటి సంకేతములు వాడి సెడ్ ఆదేశముల ఫలితములను ఇతర కార్యక్రమములకు పంపవచ్చును. లేక ఇతర కార్యక్రమముల ఫలితములను సెడ్‌లో వాడుకొనవచ్చును. పునరావృతము(for ...do ...done; loop)భాగముగ వాడుకొన వచ్చును.

సెడ్‌ని ఉపయోగించి కావలసిన మార్పులు రెండు విధానములొ చేయువచ్చును. 1. వచ్చు ఫలితమును ">"చిహ్నమువాడి ఇతర పత్రమునకు పంపవచ్చును. 2.సెద్ వాక్యావళి(syntaxలో "-i" అను వాదమును జతపఱచి , చేబట్టిన పత్రములోనే మార్పులను గావింపవచ్చును. కావలసిన మార్పులు మొత్తము పత్రమున/మొత్తము విభాగమున జరపవలెననిన "g" అను వాదము(option) వాడవలెను.

ఉదాహరణములు :

మనవి : సెడ్ ఆదేశములు కచ్చితమైన/దిట్టమైన పదములు/ సంకేతములతో కూడినది. ఆదేశములలో పదముల మధ్య అనవసరమైన ఖాళీ స్థలము, ఉన్న ఖాళిస్థలము/సంకేతములను తొలగించుట, సంకేత చిహ్నము(special characters)లలో తేడా - ఇటువంటి సూక్ష్మ తేడాలచే అదేశములు సరైన ఫలితములివ్వకపోవచ్చును. కనుక ఇవ్వదలచిన ఆదేశములను క్షుణ్ణముగ పరిశీలింప వలెను.

(1) "sed 's/Telengna/Telangana/g' NewState.txt> NewState2.txt." Or "sed-i 's/Telengna/Telangana/g' NewState1.txt." ఈ ఆదేశము NewState.txt అను పత్రమున Telengana అను (తప్పైన) పదమును Telangana అని సరిచేయును.....మొదటి ప్రయోగమున (< చిహ్నముతో) ఈ దిద్దుపాటు NewState2.txt అని క్రొత్తగ సౄష్టింపబడిన పత్రమున చేయబడును. రెండవప్రయోగమున ("-i" వాదముతో) చేపట్టిన పత్రముననే చేయబడును - పత్రము రూపము మాఱును.(NewState.txt). ఇటువంటి మార్పులు మొత్తము విభాగమున చేయవలసినచో "for ....do ....done " loopవాడవలెను. "for f in a*.html; do sed -i '46 s/తోండి/తోడి/' $f done" అను పునరావృతము(loop)తో తోండి అను (తప్పు) పదమును తోడి అని సవరింపబడినది. ఈ ఉదాహరణమున 46 మార్పుచేయవలసిన పదములున్న line. ఒక్క ప్రయోగముతో 14 విభాగములలో ఉన్న 40 పత్రములలో (సు.15000 పత్రములను వెతికి) దిద్దుపాటు చేయబడినది.

(2)పంక్తుల మొదతిస్థానములో మార్పుకొరకు ఉపయోగింపవలసిన ఆదేశము: "sed -i 's/^/*/g' inputfile. Or "sed 's/^/*/g' inputfile> outputfile". ఇక్కడ "^"= మొదతిస్థానము. కనుక ప్రతి పంక్తి మొదటిస్థానమున * అమర్చపడుతుంది.

(3)పంక్తుల మొదతిస్థానములో మార్పుకొరకు ఉపయోగింపవలసిన ఆదేశము:- "sed -i 's/$/*/g' inputfile" or "sed 's/$/*/g' inputfile> outputfile". ఇక్కడ "$"= చివరిస్థానము. కనుక ప్రతి పంక్తి చివరిస్థానమున * అమర్చపడుతుంది. ఒక ఆదేశముతో పలు మార్పులు చేయుటకు కావసిన ఆదేశము:"sed -i -e 's,to be replaced,new,g' -e 's,to be replaced,new,g' -e 's,to be replaced,<\/a><\/td><\/tr>,g' dhanyasi.txt" ....ఇక్కడ dhanyasi.txt అను పత్రమున పలు మార్పులు చేయబడుచున్నవి. "<\/a><\/td><\/tr>". \ /లను గమనింపగలరు.

(4)"echo hello | sed 's/[a-z]/\U&/g' "అను ఆదేశము:: పెద్ద(Capital)అక్షములతో HELLO అను పదము కనిపించును. "echo HeLlO | sed 's/[A-Z]/\L&/g'" అను ఆదేశము ఇచ్చినచో "hello"చిన్న అక్షరముల(non-Capital letters)తో కనిపించును. సామాన్య సెడ్ వాక్యావళి తో "[A-Z] [a-z] \U& \L& ఉపయోగించినచో పెద్ద(Capital)/చిన్నాక్షరము(small letters)ల మార్పులు జరుగును.

(5)ఒక దీర్ఘమైన పత్రమునుండి - సు. 19000 పంక్తులు గల దస్త్ర్మునుండి 16224 నుండి 16482 పంక్తులు ఎన్నుకొనుటకు ఇవ్వవలసిన ఆదేశము "sed -n '16224,16482p;16483q' filename> newfile." ఆదేశ అంతమున గల "q" సమీక్షను ఎన్నుకోవలసిన పంక్తి తరువత పక్తితో ఆపుతుంది.

(6)"sed '2,4d'" filenameఅను ఆదేశమిచ్చిన తొలగింపవలసిన పంక్తులను చూపించును.

ఈ పంక్తులను తొలగించుటకు ఇవ్వవలసిన ఆదేశము: "sed -i '2,4d' filename"

(7)ఆదేశమున "!" చేర్చిన విరుద్ధమైన ఫలితమునిచ్చును. "sed -i '2,4!d' filename" అను ఆదేశము 2నుండి 4వ పంతులను తప్ప తక్కిన పంక్తులను తొలగించును.

హెచ్చరిక: పని మొదలుపెట్టుటకు ముందు ఉపయోగింపపోవు దస్త్రములు/విభాగముల నకళ్లను బదిలపఱచుకొనవలెను. లేక ">" చిహ్నమునువాడి క్రొత్త పత్రమునకు తరలింపగలరు. తరచుగ files,data తొలగించిన తరువాత వాటి అవసరము కలుగవచ్చును.

సెడ్ ఒక మహోన్నతమైన పరికరము(software). దీని గురించిన టిప్పణులను (wwwDOTgnuDOTorg)క్షుణ్ణముగ చదవగలరు.

విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!