Bhimalapuram.co.in
టార్

ఆంగ్లము తెలుగులిపిలేదు

దస్త్రములను, దస్త్రములగుచ్చములు/పలు దస్త్రములు గల విభాగములను బదిలపరచుటకు/అవసరమైనప్పుడు కావలసిన స్థముల తెచ్చుకొనుటకు వాడబడు సాధనము "టార్". టర్ ఉపయోగించి చిత్రములు,దస్త్రములు/దస్త్రముల గుచ్చములను email లేక యూఎస్‌బీ వంటి మాధ్యముల ద్వార సులువుగ తరలింపవచ్చును. ఈ పరికరముతో దస్త్రములు/దస్త్రములు గల విభాగములను క్లుప్త/సంక్షిప్త పరచ వచ్చును. క్లుప్తపరచబడినవాటిని మూల రూపమునకు పునరుద్ధరింపవచ్చును. టార్ ఇతర టార్ దస్తావెజులనుండి మార్పులు/చేర్పులు చేయగలదు. దస్త్రములను/దస్త్ర గుచ్చములను క్లుప్తపరచ గలదు, క్లుప్తరూపముననుండి మూలరూపమునకు పురరుద్ధరింప గలదు. టార్ ఉపయోగించునప్పుడు ఇవ్వవలసిన ఆదేశములు "tar" అను పదముతో ప్రారంభమగును.

1.దస్తావెజు సృష్టించుట:(Creating an Archive) "tar -cf *.tar". "c" అను అక్షరము సృష్టించుటకు, "f" అను అక్షరము సృష్టింపబడనున్న దస్తావేజు పేర్కొనుటకు వాడబడుచిన్నవి. దస్తావేజు సృష్టింపకుండ నిదర్శనమునకు మాత్రమైతే "t" అను అక్షరము వాడవలెను. సృష్టించినప్పుడు జరుగు వివరములు కావలెననిన "v" అను అక్షము చేర్చవలెను.

"tar -cvf penguin4u.tar *.txt, *.html, *.png అను ఆదేశము "txt, html, png అను ప్రత్యయములు గల (పనిచేయు విభాగమున ఉన్న) అన్ని దస్త్రములు ఉన్న పెన్‌గూయిన్4యూ.టార్ అను దస్తావేజును సృష్టించును. జతపరచబడిన filesల పట్టికను తెర(terminal)పై చూపించును. ఈ వివరములు శాశ్వతముగ కావలెననుకున్నచో "tar -cvf penguin4u.tar *.txt, *.html, *.png> penguincheck.txt".అని ప్రత్యక పత్రముfileన వచ్చునట్టు చేసుకొనవచ్చును. (ఇక్కడ ఉదాహరణమునకు ఇవ్వబడిన పేరు పెంగూయిన్*) అవసరమైనప్పుడు penguincheck.txt అను పట్టికను చూడవచ్చును.

2.దస్తావేజు సృష్టింపకుండ వివరములను మాత్రము చూడదలచినచో ఇవ్వవలసిన ఆదేశము "tar -tvf penguin4u.tar *txt, *html, *png> checkpenguin.txt".

3."cvf...." లేక "cf...." tar ఆదేశములకు "-j" అను పదము చేర్చినచో టార్ దస్త్రము క్లుప్త రూపమున తయారగును. "tar -cvfj penguin4u.tar.tbz *txt, *html, *png" అను ఆదేశము క్లుప్తముచేయబడిన టర్ file సృష్టించును. tar "cvf...", tar "cf ..." అను టార్ ఆదేశములకు "-z"అను పదము చేర్చినచో gzipతో క్లుప్తము చేయబడిన టర్ దస్తావెజు(file) సృష్టింపబడును. "tar -cvfz peguin4u.tar.gz *txt, *html, *png" అను ఆదేశము penguin4u.tar.gz అని పేరు గల (gzipతో) క్లుప్తముచేయబడిన టార్ దస్తావేజు(file) సృష్టింపబడును.(ఇక్కద ఉదాహరణమునకు ఇవ్వబడిన పేరు పెంగూయిన్* మొదలైనవి) టార్ fileళ్లను రెండు దశలలో జీజిప్, బీ2జిప్, xzజిప్ లెక ఇతర zipవిధానములతో క్లుప్తము చేసుకొనవచ్చును. ఈ మార్గము ఒకే ఆదేశముతో క్లుప్తముచేయుట కన్న ఉచితమైనది. టార్file అవసరమైతే- ("-k")పదమును క్లుప్తముచేయు అదేశములో చేర్చి- విడిగా బదిలపరచుకొనవచ్చును. పూర్తి వివరములకు టిప్పణులను చూడ గలరు.

4. టార్ దస్తావెజునుండి fileళ్లను వెలుదీయుట: ఇవ్వవలసిన ఆదేశము: "tar -xf penguin4u.tar". .వివరములు కావసినచో "v" అక్షరమును చేరిచి "xvf" అను ఆదేశము ఇవ్వవలెను. టార్ gzipతో క్లుప్తమైనచో "tar -xf penguin4u.tar.gz" అను ఆదేశము ఇవ్వవలెను. మొదట జిప్ పరికరముతో సామాన్య రూపమునకు తెచ్చి, తరువాత "-k" తో టార్ fileళ్లను నిలువ చేసుకొనవచ్చును. వీలైతే వేరు స్థావరమున (in another directory) ఈ ప్రక్రియ చేసినచో - ఆపదలు/ప్రమాదములు కలుగవు. పూర్తి వివరములకు టార్కైన టిప్పణులను చూడగలరు.

Directory ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!