Bhimalapuram.co.in

లైనక్‌స్ - సూచికలు

ఆంగ్లము తెలుగులిపిలేదు

లైనక్స్/ఫ్రీబీఎస్‌డిల పని తీరును అభివృధ్ధి చేయుటకు కొన్ని మార్గములున్నవి.

1. "{ }" చిహ్నము వాడుట .: ఒకే ఆదేశముతో అనేక భాగములు [directories] సృష్టించుట: "mkdir" ఆదేశమును "{}"చిహ్నములతో వాడవలెను. "mkdir {ab,cd,ef,gh,i}అను ఆదేశము ab, cd, ef, gh, i విభాగములను సృష్టించును . "rmdir", "chmod", "mv", "touch" వంటి అదేశములు కూడ ఇదే తీరున వ్యవహరించును.

1.b. "mkdir" తో "-p" అను చేర్పు వలన ఒక్క ఆదేశము తోనే చాల చిక్కైన పనులను పూర్తి చేయగలము. "mkdir -p a,b/c,d/e/f,g/h/i/j" అను ఆదేశము విభాగము, విభాగములో ఉపవిభాగము, అందులో ఉపవిభగము ....అని చాల చిక్కైన కార్యమును నెరవేర్చును.

2. ఒక పత్రము- fileను ఒక ఆదేశముతో అనేక విభాగములలో- స్థలములలో నకళ్లు తీసికొనుట: జారి చేయవలసిన ఆదేశము:

"echo dir1 dir2 dir3 | xargs -n 1 cp file1" లేక

"cat inputfile |tee outputfile1 outputfile2".

file1, inputfile = నకలు చేయవలసిన సంపుటము;

outputfile1, outputfile2 ఈ ప్రక్రియానంతరము నకలైన సంపుటము- fileలు.

dir1, dir2, dir3 - అదనపు నకల్ల నుంచవలసిన ఉపవిభాగములు

2. b. వివిదమైన అనేక సంపుటము/పత్రముల[files]ను మరొక చోట నకలు చేసికొనుట: "cp {*.txt,*.html,*.pdf,*png} /xyz/. ఇక్కడ /xyz/ గమ్య స్థలము - విభాగము .

"mv {*.txt,*.html,*.pdf,*png} /xyz/." ఇక్కడ /xyz/ గమ్య స్థలము - విభాగము .

పై రెండు ఉదాహరణములలో - ఆదేశములలో బిందువు గలదు. ఈ బిందువు లేనిచో ఆదేశములు సరైన ఫలితమునివ్వవు.

2. c.చాల పొడవైన ఒకటి లేక రెండు [ లేక మూడు] సమాంతర వరుసలు[horizontal columns] గల వ్యాసమును సమగ్రముగ చేయుట: "paste -d" " - - <inputfile> outfile" అను సూత్రమును వాడి రెండు పంక్తులతు జతపరచవచ్చును. "paste -d" " - - - <inputfile> outputfile" " అను పదజాలము మూడు పంక్తులను ఒకటిగ చేర్చును. "-" కలపవలసిన పంక్తుల సంఖ్యను సూచించును. ఉదా|| అసలు [ప్రధాన] పత్రమున 1024 పంక్తులుండెను. పై ఆదేశముతో సవరింపడిన పత్రమున 324 పంక్తులే గలవు. ఈ సవరణలో 4 పంక్తులు చేర్పబడినవి. క్రొత్త పత్రికలో చేయబడిన అదనపు సవరణలు : 1. సరిహద్దున వున్న గీతలు "<table border="0">" అను ఆదేశముతో తీసివేయబడినవి. 2. కీర్తన అను భాగమును, అనుబంధమునకైన భాగమును ఒకటిగ సంయుక్తపరచబడినది.

3. లైనక్‌స్‌లో పలు ఆదేశములు - ఒకటి తరువాత ఒకటిగ ఒకే సారి ఇవ్వ వచ్చును. ఒక ఆదేశమిచ్చిన తరువాత దాని ఫలితము - ప్రక్రియ - పూర్తియగునంతవరకు వేచి యుండ నవసరము లేదు. ప్రతి ఆదేశాంతమున ";" చిహ్నము వుండ వలెను.

4. పని తీరును- వేగమును, భద్రతను మెరుగు పరచుటకు చేయవలసిన క్రియ: అవసరమైన - తరచుగ ఉపయోగించు - వనరులను మాత్రము - ప్రారంభ దశలో - మొదలు పెట్టవలెను. తక్కిన వనరులను అవసరమైనప్పుడు మాత్రము మొదలు పెట్ట గలరు.

5. ఆర్సిన్‌క్, డంప్ వంటి పరికరములతో వ్యవస్థ లోని వషయముల నకలును బాహ్య సాధనము [ external devices -సీడి/డీవీడీ/పెన్‌ద్రైవ్] లలో బదిల పరచుకొన వలెను. హఠాత్తుగ ఆపదలు సంభవించినను, బదిల పరచిన నకలు నుండి పనులు కొన సాగింప వచ్చును. రైడ్, ఎల్‌టిఎస్‌పి, High Availability Clusters వంటి పరికరములతో ఎటువంటి ఆపద కలిగిన - కార్యక్రమములకు అంతరాయము కలగకుండ చేసుకొన వచ్చును. మిర్రరింగ్- (కార్యక్రమములను ప్రతి బింబము వలె నకలు చేసు కొనుట) వంటి పధ్ధతులను అవలంభించి ఎప్పటికప్పుడు జరుగు కార్యక్రమముల నకలును సిధ్ధముగ వుంచుకొనుట వలన అపాదలు వచ్చిన కాల వ్రయము లేకుండ కోలుకొన గలరు.

6. ట్రిప్‌వైర్, రూట్‌కిట్ వంటి రక్షణా పరికరములను వాడి ఆత్మ రక్షణను పెంచుకొన గలరు.

7. సెడ్, ఆక్, గ్జేటెక్స్ వంటి ప్రసిధ్ధి కాంచిన వసతులను వాడి పనులు వెగవంతముగ చేసుకొన గలరు. వీటి ఉపయోగములను అందరికి తెలియచేసి లభ్ది పొందవలెను.

8. ఉన్న పరికరములలో తక్కువ పరిమాణము గల వాటిని ఎన్ను కొన వలెను. abiword+gnumeic ఇంచుమించు Open Officeనకు సమమైనవి- కాని చాల తక్కువ పరిమాణము గలవి. ఈ సూచనలు అన్ని రకములైన లైనక్‌స్, ఫ్రీబీస్‌ డిలందు ఉపయోగ మగును.

9. xhtml/html పత్రముల రూపమును మెరుగుపరఛుట: " a {text-decoration:none;}" అను వాక్యమును cssలో చేర్చి అనుబంధములకైన పదముల అడుగున వచ్చు గీతలు తొలగిపోవును. ఉదా|| tipstelu.html పత్రమున పదములక్రింద గీతలున్న రూపమును, పదములక్రింద గీతలు లేని రూపమును పోల్చి తేడాను గమనింప గలరు.

10. చిత్రములను చేర్చుట: సాధారణముగ చిత్రములను చేర్చుటకు "కన్వెర్‌ట్" అను ఆదేశమునకైన "అప్పెండ్" అను ప్రత్యయము[option/suffix] సరైన మార్గము. a. ఒక చిత్రము క్రింద మరొక చిత్రము: "convert 1.png 2.png -append 3.png" అను ఆదేశము చిత్రములను ఒకటి క్రింద మరొకటిగ కలుపును. ఉదా|| ఆంగ్ల వివరములు గల ap-tse తెలుగు వివరములు గలap-tste చిత్రములు ఒకటి క్రింద మరొకటిగ అతికింపబడినవి. b. సమాంతముగ కలుపుట: "convert 1.png 2.png +appnd 3.png" అను ఆదేశము చిత్రములని సమంతముగ ఒకటి ప్రక్కన మరొకటిగ-ఎడమ వైపునుండి- కలుపును. ఉదా|| ఆంగ్ల వివరములు గల ap-tse తెలుగు వివరములు గల , ఆంగ్ల వివరములు గల ap-tste చిత్రములు సమాంతముగ - ఎడమవైపునుడి - ఒకటి తరువాత మరొకటిగ అతికింపబడినవి.

ఈ చిట్కాలన్నియు ఫ్రీబీఎస్‌డీనకు కూడ వర్తించును.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!