Bhimalapuram.co.in

పరిచయము

ఆంగ్లము తెలుగులిపిలేదు

పరిచయము :: మా వేదిక. ఈ website విభిన్నమైనది. ఇక్కడి విషయములన్నియు ఉచితముగ లభించు - దిగుమతి చెసుకొనటకు వీలగు రూపములలో ఇవ్వబడినవి. వీటిని ఎటువంటి చట్టములను ఉల్లంఘింపకుండ దిగుమతి చేసికొని స్వేచ్చగ ఉపయోగించుకొన గలరు.

దిగుమతి చేసుకొనుటలోని ఆలస్యము/ఇబ్బందులు తగ్గించుట కొరకు చిత్రముల ఉపయోగము వీలైనంత వరకు తగ్గింపబడినవి.

పరిచయము :: తెలుగుభాష.తెలుగు భాష వెయ్యి సంవత్సరములుగ ఉన్న ప్రాచీనమైన భాష. నన్నయ కాలమునుండైన క్రోడింపబడిన సాహిత్యము కనబడుచున్నది. ఆంగ్లము వంటి భాషలకు సమానము గాక పోయినను - అన్ని రంగములలో - [గద్యము, పద్యము, నాటకము, జాన పద గీతములు, చిన్నారులకైన జోల పాటలు] - గొప్ప రచనలున్న భాష. ఇటువంటి భాష గొప్పతనమును గుర్తించి, రక్షించి ఉన్నతస్థానమునకు తీసుకెళ్లుట మన కర్తవ్యము.

పరిచయము :: తెలుగులిపి. ఈ చరిత్రను చూడ గలరు. ఇప్పుడు వ్యవహారమున నుండు లిపి వెయ్యి సంవత్సర కాలమున సంస్కరింపబడి అందముగ , తేలికగ గుర్తుంచుకొన గల రూపము పొందినది. ఇబ్బందికరమైన లేక కష్టమైన, నిరుపయోగమైన అక్షరములు తొలగింపబడి/సులువైన రూపమునకు మార్చి అమర్చబడినవి. ఈ లిపి చాల గొప్పది : ఉచ్చరింపబడు అన్ని శబ్దములను చూపగలదు. మాట్లాడినట్టే వ్రాయ గలము - ఈ వసతి ఆంగ్లము వంటి భాషల కంటే తెలుగులో ఎక్కువగ గలదు. కనుక తెలుగు లిపి ఆంగ్లము కంటే చాల మెరుగైనది. పద ఉచ్చారణ [spelling] గురించి విడిగ - ఆంగ్లము/ఐరోపా భాషలకున్నట్టు- సుదీర్ఘ నిఘంటువుల అవసరము లేదు. ఉచ్చరించినట్టే వ్రాయుట చేత ప్రత్యేకముగ గుర్తించుకొన వలసిన అవసరములేదు.

ఇది ఒక భగీరథ యత్నము. క్రమ క్రముగ విస్తరింప బడును.కాల జాప్యమును ఓర్చు కొనమని మా విన్నప్పము. మీరు ఇందులో పాల్గొనతలచినచో, వివరములతో సంప్రదింప వలసిన మా చిరునామా: gbsubrahmanyamATgmailDOTcom

Valid XHTML 1.0 Transitional

Valid CSS!