Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -109
అడియ నడియనయ్య యఖిలలోకైకనాథ
రాగము: బౌళి
అడియ నడియనయ్య యఖిలలోకైకనాథ | |
తడతాఁకుల తాపత్రయము మానుపుటకు | ॥పల్లవి॥ |
శరణు శరణు వోసర్వేశ్వర నీకు | |
మరణభయములెల్ల మానుపుటకొఱకు | |
మొరయొ మొరయొ నీకు ముకుంద మాధవ | |
దురితములిన్నియుఁ దొలఁగించుటకు | ॥అడియు॥ |
దండము దండము నీకు దైవశిఖామణి | |
పండియుఁ బండని మతి పాకముసేయు కొరకు | |
అండనే దాస్యము దాస్యము నీకు నేనైతి | |
నిండు నీకరుణ నాపై నించేటి కొరకు | ॥అడియ॥ |
అభయ మభయము శ్రీయాదినారాయణ | |
వుభయకర్మము నాకు నూడుచుట కొరకు | |
విభుఁడ శ్రీ వేంకటేశ వినుతి సేసెద నిన్ను | |
శుభములన్నియు మాకుఁ జూపేటి కొరకు | ॥అడియ॥ |
కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు