Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -130

అడుగరే యీమాట అవునో కాదో

రాగము: దేశాక్షి

అడుగరే యీమాట అవునో కాదో
బడిబడి నిందరిలోఁ బచారించవలెనా॥పల్లవి॥
  
  
యీతల నేవిన్నవించేదేమి సారెసారెకు
అతఁడే యెరుఁగునే అన్నియును
ఘాతల నామీఁదనే కరుణఁగలఁడు తొల్లె
నీతులుగా నిఁక వేరే నేరుపఁగవలెనా॥ఆడు॥
  
  
పూనివట్టి నే నిప్పుడు పొంచి యెచ్చరించేదేమి
తానే యెరుఁగునే తలఁపులెల్లా
యీనెలవులనే నన్నే యేలుకొని వున్నవాఁడు
వీనుల నే నింతేసి వివరించవలెనా॥ఆడు॥
  
  
మఱవకుమని నేను మరి వేఁడుకొననేల
యెఱుఁగునే శ్రీవేంకటేశ్వరుఁడే
అఱిముఱి నన్నుఁ గూడె నలమేల్ మంగను నేను
గుఱిసేసి యింకా మఱి కొసరఁగవలెనా॥ఆడు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!