Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -160

అతని తలపు దెలియఁగరాదా । నీ-

రాగము: లలిత

అతని తలపు దెలియఁగరాదా । నీ-
మతిలోని కాఁకలెల్ల మందలించేఁగాని॥పల్లవి॥
  
  
అన్నియుఁ జెప్పేఁగాని యతఁడంపినట్టిచెలి-
విన్నపమంతయు నీవు వినరాదా
యెన్నిక లంతటిమీఁద నెట్టువలసిన నయ్యీ
కన్నులఁ గన్నంతనే గారవించుమీ॥అత॥
  
  
ఇద్దరితలంపులకు నిక్కువ చెప్పేఁగాని
పెద్దరికమున నాకెఁ బెంచరాదా
గద్దరిచలములేల కలది కలిగినట్టె
వొద్దిక నన్నియు నీ వొప్పుగొనుమీ॥అత॥
  
  
వెలఁదిఁ బుతైంచి తా వెంటనే శ్రీవేంకట-
నిలయుండు వీఁడె వచ్చె నీవు రారాదా
తెలిసి ఇద్దరుఁ గూడితిరి మాకిందరి కిదె
సెలవు నీపతి నిదె చిత్తగించుమీ॥అత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!