Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -169

అతని మన్ననే చూచే వప్పుడె నీవు

రాగము: మధ్యమావతి

అతని మన్ననే చూచే వప్పుడె నీవు
యితవై మీ యిద్దరిలో యెంతసమ్మతములో॥పల్లవి॥
  
  
చెలువుని మోము చూచి సెలవులఁ బార నవ్వి
చెలితో మాటలాడేవు చెల్లఁబో నీవు
అలవోకఁ బవళించి యాకుమడి చిచ్చేవు
అల వెఱఁగవు పతి నౌనే నీవు॥అత॥
  
  
కాటుక దీరుచుకొంటా ఘనునితోఁ బలికేవు
నేటివలె నుండునటె నేరవు నీవు
నీటున నొయ్యారిబాగై నిలుచుండి మొక్కేవు
వోటలేదు దొరచిత్తా లొకరీతి నుండునా॥ఆత॥
  
  
తొడమీఁదఁ దొడవేసి దొరతనమే చూపేవు
నడుమ శ్రీవేంకటేశు నంటున నీవు
జడికొని దోమతెరచాటునఁ గూడి మాకు
నడియాలాలు చూపేవు అంతలో నీవు॥అత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!