Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -23

అచ్చముగా శ్రీ హరింక అడ్డమాడ వెఱతు

రాగము: సామంతం

అచ్చముగా శ్రీ హరింక అడ్డమాడ వెఱతు
తెచ్చి నన్ను తిద్దుకొమ్మీ దేవుఁడ వీవు॥పల్లవి॥
  
  
నెరుసు లెంచేనంటే నేనా నీకు నెదురు
కరుణించి వొకరీతిఁ గాతువు గాక
వొరగంట బంగారు వొరతురు గాని మరి
సరిగాఁ బెం కొరసితే సాటి వచ్చీనా॥అచ్చము॥
  
  
మనసు సోదించేనంటే మంచివాఁడవా నేను
ఘనుఁడవు నీవు నన్నుఁ గాతువు గాక
పనికి వజ్రము సానఁ బట్టితే మిం చెక్కుఁ గాక
పెనుఁ బిడుక రాచితే పిప్పి గట్టదా॥అచ్చము॥
  
  
మొక్కఁగా రక్షించేనంటే మొదల సుజ్ఞానినా
గక్కున శ్రీ వేంకటేశ కాతువు గాక
నిక్కి అద్దము దోమితే నీడ గానవచ్చుఁ గాక
ముక్కమూఁకుడు దోమితే మోము గానవచ్చునా॥అచ్చము॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!