Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -33.

అటమీఁద నయినట్లయ్యీఁ గాని

రాగము: గౌళ

అటమీఁద నయినట్లయ్యీఁ గాని
సట లింతే తాముఁ దామే సంతము లయ్యేరు॥పల్లవి॥
  
  
పలికినంతే చాలు పచ్చి సేయకురే యింతి
నలుక దేరినమీఁద నడిగేఁ గాని
చెలవుఁ డీసుద్ది వింటే చేర వచ్చునో రాడో
కలయిక కిద్దరినిఁ గదియింత మిపుడు॥ఆటమీఁద॥
  
  
నవ్వినపాటే చాలు నానఁ బెట్టకురే మీరు
నెవ్వగ దీరితే బుద్ది నేనే చెప్పేను
అవ్వల నీపా టైతే నాతనిఁ దేరుచ రాదు
దవ్వుల నిద్దరి సమతారుకాణ నేతము॥అటమీఁద॥
  
  
తానెచూచినంతే చాలు తరువుల వెట్టకురే
మేనులు సోఁకినమీద మించీఁ గాని
ఆనుక శ్రీవెంకటేశుఁ డలమేలుమంగఁ గూడె
పానిపట్టి యింతలోనే పంగింత మిపుడు॥అటమీఁద॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!