Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -411

అన్నియు నీతనిమూల మాతఁడే మాపాలఁ జిక్కె

రాగము: మాళవిగౌళ

అన్నియు నీతనిమూల మాతఁడే మాపాలఁ జిక్కె
కన్నుల మా వేడుకకు కడయేది యిఁకను॥పల్లవి॥
  
  
కామధేనువు గలి(గి?)తే గర్వించు నొక్కరుఁడు
భూమి యేలితే నొకఁడు పొదలుచుండు
కామించి నిధి గంటె కళలమించు నొకఁడు
శ్రీమంతుఁడగు హరి చిక్కె మాకు నిదివో॥అన్ని॥
  
  
పరుసవేదిగలి(గి?)తే పంతములాడు నొకఁడు
ధరఁ జింతామణబ్బితే దాఁటు నొకఁడు
సురలోక మబ్బితేను చొక్కుచునుండు నొకఁడు
పరమాత్ముఁడే మా పాలఁ జిక్కెనిదివో॥అన్ని॥
  
  
అమృతపానము సేసి యానందించు నొకఁడు
భ్రమను దేహసిద్ధిఁ బరగొకఁడు
తమి శ్రీవేంకటేశుఁడే దాఁచిన ధనమై మాకు
అమరి నా మతిఁ జిక్కె నడ్డములే దిదివో॥అన్ని॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!