Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -427

అన్నియు మరుఁడెఱుఁగు నౌనే తాను

రాగము: ముఖారి

అన్నియు మరుఁడెఱుఁగు నౌనే తాను
సన్నసేసి కాననీని జాణఁడే తాను॥పల్లవి॥
  
  
ఆసలాసలఁబెట్టి అలయించుటాఁగాక
వేసాలకు నున్సురినీ వేళమే తాను
బాసవేసి యింతలెనె పాడి దప్పుటాఁగాక
దోసాన కొడిగట్టీని దొడ్డఁవాడే తాను॥అన్ని॥
  
  
పచ్చిమాఁటలాడి నన్ను భ్రమయించుటాఁగాక
నచ్చుకోట్టికొంతగొంత నవ్వీనే తాను
కుచ్చి నన్ను దగ్గరుచు గోరు దాఁకించుటాఁగాక
పెచ్చుగాఁ బెట్టకుమంటాఁ బెనఁగీనే తాను॥అన్ని॥
  
  
గక్కనఁ గాఁగిటిలోనేఁ గరఁగించుటాఁగాక
ముక్కుమీఁద నొంటివేలు మోపీనే తాను
పక్కన రతుల సరి పంతమాడుటాఁగాక
యెక్కుడైన శ్రీవేంకటేశుఁడే తాను॥అన్ని॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!