Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -448

అన్ని సింగారాలు నీకె అమరుఁగాక

రాగము: లలిత

అన్ని సింగారాలు నీకె అమరుఁగాక
యన్నిటా దేవతలు నిన్నిందుకే మెచ్చేరు॥పల్లవి॥
  
  
చందురునివంటిమోము జలజాలే కన్నులట
యిందిర నీకే తగు నీ కొత్తలు
గొంది నొకటొకటికిఁ గూడవందు రివి నీకు
పొందై పాలవెల్లి తోడఁబుట్లే కావా॥అన్ని॥
  
  
ముక్కు సంపెంగవంటిది ముంగురులు తేంట్లట
ఇక్కువలు నీకే తగు నీ కొత్తలు
అక్కున వరలక్ష్మివి హరి వసంతమాధవుఁ
డెక్కడా మీ కిద్దరికి యెనయికే కాదా॥అన్ని॥
  
  
ధర నడుము సింహము తగు గజగమనాలు
తిరమై శ్రీ వేంకటేశుదేవు నీకే పో
నరసింహుఁడై యుండి కరిఁగాటినట్టివాని-
సురత మందితిగాన చుట్టమువేకొవా॥అన్ని॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!