Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -476
అప్పటి కాఁతాళాన నందుముగాక
రాగము: సామంతం
అప్పటి కాఁతాళాన నందుముగాక | |
తిప్పఁబోతే నీ గుణాలు తీరౌనా మాకు | ॥పల్లవి॥ |
నేరుపుననాడె కల్ల నిజమువలెనెవుండు | |
యేరుపరచేమంటె యెటువచ్చును | |
నీరచనల నీవును నిలువునూరువండు | |
తారుకాణించే మంటె తరమా మాకు | ॥అప॥ |
దరిచేరి దండాలు తనవద్దనెవుండు | |
సరవికి దిద్దేమంటె చాయకురావు | |
వెరసి మెయిగురుతులు వేయిసే నొక్కొక్కటి | |
వొరసి వెలవెట్టఁగ నోపికేది మాకు | ॥అప॥ |
ప్రేమపు మోవితేనెలు పెదవిమీఁదనెవుండు | |
చేముట్టి వడ్డించఁబోతె చిరునవ్వులు | |
గామిడి శ్రీవెంకటేశ కలసితి విటు నన్ను | |
దోమటి దొడికేమంటె దొడ్డా మాకు | ॥అప॥ |
కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు