Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -518

అప్పటి మాతోడి పొందు లాసపడేవు

రాగము: దేసాళం

అప్పటి మాతోడి పొందు లాసపడేవు
కప్పరము నీ వియ్యఁగా కాదు గూడదనేమా॥పల్లవి॥
  
  
జంకెన చూపులఁ జూచి జాజరపాటలు వాడి
అంకెలకుఁ దెచ్చుకొనె నాపె నిన్నును
కుంకుమ గుబ్బలు సోఁక కొనగోరఁ గొప్ప దువ్వి
కొంకక యిన్నిటా దక్కఁగొనెఁ గదవయ్యా॥అప్ప॥
  
  
సెలవుల నవ్వు నవ్వి చేతులు నీపైఁ జాఁచి
వలపించుకొనెఁగా వనిత నిన్ను
సొలపుల మాటలనే చుట్టరికములు సేసి
యెలమి నిన్నింత యెలయించెఁగదవయ్యా॥అప్ప॥
  
  
విడెము చేతికిచ్చి వేమారు సరసమాడి
వాడికె సేసుకొనెను వైపుగా నిన్ను
యీడనె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
జాడతోఁ దా నీపై సేస చల్లెఁగదవయ్యా॥అప్ప॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!