Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -531

అప్పటి సుఖమేకాని యటమీఁదెంచుకొనఁడు

రాగము: నాదరామక్రియ

అప్పటి సుఖమేకాని యటమీఁదెంచుకొనఁడు
ఉప్పతిల్లు జీవుని వుద్యోగా లిట్టివి॥పల్లవి॥
  
  
తనుభోగపురతులు దలపోయుచుండుఁగాని
తన నరకకూపాలు దలపోయఁడు
కనకభూషణములు గని వెరగందుఁగాని
ఘనకర్మబంధాలకుఁ గడు వెరగందఁడు॥అప్ప॥
  
  
యీకడాకడఁదాఁ జేసేటియెమ్మెలే యెంచుఁగాని
పైకొని కూడేటిపాపము లెంచఁడు
దీకొని జగములోని ద్రిష్టములే చూచుఁగాని
భీకరపు జన్మముల పిరివీకు చూడఁడు॥అప్ప॥
  
  
వింతవింత మాటలవేడుకలే వినుఁగాని
అంతటఁ దాఁ బడేపాట్లవి వినఁడు
ఇంతటా శ్రీవేంకటేశుఁడేలఁగా నెరిఁగెఁగాని
యెంతచెప్పినాను బుద్ధి యిన్నాళ్ళు నెరఁగఁడు॥అప్ప॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!