Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -543

అప్పుడుగాని తలఁపు అలవాటై వుండదు

రాగము: బౌళి

అప్పుడుగాని తలఁపు అలవాటై వుండదు
వుప్పతిల్లు తత్త్వజ్ఞానికి వూహింపుచు నుండఁగవలెను॥పల్లవి॥
  
  
సాలీని మతి పడుగు చరిసేసే యందే యుండు
గాలిపు బెండుపై వేఁటకాని కుండును
వాలాయించి దృష్టి వింటివానికి గుఱిపై నుండు
యీ లీల తత్త్వజ్ఞానికి యెచ్చరికై యుండవలెను॥అప్పుడు॥
  
  
దున్నేవానికి మనసు తొలుతఁ జాలుపై నుండు
పన్ని జూజరికి నాటపై నుండును
సన్నలఁ గోమటిచూపు సరకులపై నుండు
యెన్నఁగాఁ దత్త్వజ్ఞానికి యెచ్చరికై యుండవలెను॥అప్పుడు॥
  
  
భూమిలో దొంగకు చింత పొద్దు పైనే వుండు
కాముకుని తలపోఁత కాంతపై నుండు
ఆముకొని శ్రీవేంకటేశుఁ డంతరాత్మయై యుండును
సాముగా తత్త్వజ్ఞానికి సాధింపుచు నుండవలెను॥అప్పుడు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!