Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -587

అప్పఁడైన హరి యెక్కె నదివో తేరు

రాగము: పాడి

అప్పఁడైన హరి యెక్కె నదివో తేరు
యిప్పుడు తిరువీధుల నేఁగీ తేరు॥పల్లవి॥
  
  
సముద్రాలమీఁదఁ దోలె సర్వేశ్వరుఁడు తేరు
భ్రమయ జరాసంధుపైఁ బరపెఁదేరు
తిమురుచు రుక్మకుపైఁ దిరుగఁ దోలెఁ దేరు
ప్రమదాన సృగాలునిపైఁ దోలెఁ దేరు॥అప్ప॥
  
  
కమ్మి యక్రూరుఁడు దేఁగా కంసునిపై నెక్కెఁ దేరు
బమ్మరపో దంతవక్త్రుపైఁ దోలెఁ దేరు
దుమ్ములుగా సాల్వునిపై దొడ్డగాఁ దోలినతేరు
దొమ్మి రుక్మిణిపెండ్లికిఁ దోలినట్టితేరు॥అప్ప॥
  
  
విూఱి హంసడిచికులమీఁదఁ దోలినట్టితేరు
తూఱి సంధిమాటలకుఁ దోలినతేరు
అఱడి శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁ గూడి
చూఱలుగొన నెక్కెను శోభనపుతేరు॥అప్ప॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!