Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -593

అమర మాటాడితివి అవునే నీవు

రాగము: శంకరాభరణం

అమర మాటాడితివి అవునే నీవు
జమళి మన మాటలు సరివచ్చేవే పో॥పల్లవి॥
  
అచ్చపుఁ బంతపుమాట లాడేవు మగువ నీకు
చెచ్చెర నీమెవి యేల చిల్లులాయనే
ముచ్చట నామని కాలమునఁ బండిన పంటకు
లచ్చనలు వేయరా యీలాగుల నెవ్వరును॥॥
  
సూడుఁ బాడుకుఁ జేచాఁచే సుదతి వన్నిటా నీకు
యేడలేని జీరలు నేఁడేల వచ్చెనే
కూడి విచ్చనవిడిని కొనసాగే తీగెలకు
తోడనే ములుపొడిచి తుదఁ బోది సేయరా॥॥
  
రతుల మారు మలసే రమణి నీచన్నులకు
సతమై వొత్తిన కందుజాడ లేడవే
యితవై నన్ను శ్రీవేంకటేశ నీవు గూడఁగాను
మతిలో ననురాగము మానునా పై మించక॥॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!