Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -675

అలయించకురే నన్ను నండనున్న చెలులాల

రాగము: కన్నడగౌళ

అలయించకురే నన్ను నండనున్న చెలులాల
చెలువుఁ డీడకుఁ దా విచ్చేసు దాఁకాను॥పల్లవి॥
  
  
మనసెక్కడనో వుంది మాటలఁ బెట్టకురే
ఘనుఁడు నారమణునిఁ గన్న దాఁకాను
తను వెక్కడనో వుంది దగ్గరి పిసుకకురే
గొనకొని యాతఁడు నేఁగడుదాఁకాను॥అల॥
  
  
నగ వెక్కడనో వుంది నను వేగిరించకురే
మొగి నాతని నాచెయి మోచుదాఁకాను
పగ టెక్కడనో వుంది బలిమి సేయకురే
జిగి నాతఁడు నా చేతఁ జిక్కుదాఁకాను॥అల॥
  
  
పాయ మెక్కడవో వుంది భ్రమలఁ బెట్టుకురే
యీయడ నాతఁడు మంచ మెక్కుదాఁకాను
పాయక శ్రీవేంకటాద్రిపతి నన్ను నిటు గూడె
మోయనాడకురే వీని మొక్కించుదాఁకాను॥అల॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!