Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -700

అలుగను సేయను ఆరడి నేల పెట్టీనే

రాగము: ఆహిరి

అలుగను సేయను ఆరడి నేల పెట్టీనే
చెలియ నీవైనా బుద్ది చెప్పవే యీతనికి॥పల్లవి॥
  
  
మోము దప్పక చూచితి ముచ్చటతో నవ్వితి
ప్రేమముతో మాఁటలాడి పీఁట వెట్టితి
కామించి తా వేఁడుకొంటే కానిమ్మని ఇయ్యకొంటి
యేమిసేయుమనీనే యింకాఁదాను॥అలు॥
  
  
వీడెము చేతికిచ్చి వెసఁ బానుపు వేసితి
పాడి పాడి వేగినంతా పదా లొత్తితి
వాడుదేర నిట్టె యాలవట్టమూను విసరితి
యీడువెట్టుకొని యింకా నెంత వేఁడుకొనీనే॥అలు॥
  
  
చేతులెత్తి మొక్కితి సేవలెల్లాఁ జేసితి
కాతరాన నిమ్మపండు కానుకిచ్చితి
యీతల శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్నుఁగూడె
యేతులు నే నెరఁగను యేల రట్టు సేసీనే॥అలు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!