Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -719

కర్త :: తాళ్లపాక అన్నమాచార్య

రాగము: పాడి

అల్లవాఁడె భావించరె అంగన లిందరుఁ గూడి
వుల్లములో తనమాయ లుబ్బెనో శ్రీహరికి॥పల్లవి॥
  
  
నేలా మిన్నుఁ గొలవఁగ మిన్నేటినురుగు
ఆలరి యీహరిమేన నంటుకొనెనో
పాలవెల్లి తచ్చఁబోఁగాఁ బైఁబడెనో తుంపురులు
మేలిమి కప్పురకాపు మెత్తిరో యీహరికి॥॥
  
  
చిత్తగించి రేపల్లెఁ జీఁకటితప్పు సేయఁగా
అత్తల చీఁకటినలు పంటుకొనెనేమో
వొత్తి కరిఁ గావబోఁగా నొలికెనో పై మదము
మొత్తమిఁ బుళుగుకాపు ముంచిరో శ్రీహరికి॥॥
  
  
అలమేలుమంగఁ దెచ్చి అఱుతఁ గట్టుకొనఁగా
పొలసి నవరసాలుఁ బొడచూపెనో
నెలవైన సొమ్ములెల్లా నిండుకొనె మేననెల్లా
అలరి శ్రీ వేంకటాద్రి నందమైనహరికి॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!