Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -75

అటువంటి వైభవము లమరఁజేసిన దైవ-

రాగము: దేశాక్షి

అటువంటి వైభవము లమరఁజేసిన దైవ-
మిటువంటి యోగంబు లిన్నియును జేసి॥పల్లవి॥
  
  
జలజాక్షి లావణ్య జలధి నుప్పొంగింప
నలివేణి ముఖచంద్రుఁ డభ్యుదయమాయ
కలికి వలరాయఁడను కాలకూటంబుతో
దలకొన్న యధరామృతంబు జన్మించె॥అటు॥
  
  
వనిత సౌభాగ్యంబువనధిలోపలఁ దోఁచె
గొనకొన్న గుఱుతైన కుచపర్వతములు
తనివోనికోరికల తగుతురంగములతో
ననువైన విరహ బడబానలము గలిగె॥అటు॥
  
  
భామ యవ్వనమనెడి పాలజలనిధిలోన
వామాక్షియైన యవ్వనలక్ష్మీ గలిగె
యీమంచి తిరువేంకటేశ్వరుం డిందులోఁ
బ్రేమమున సుఖియించి పెంపొందఁగలిగె॥అటు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!