Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -755

అవునయ్యా దొరవౌదు వన్నిటా నీవు

రాగము: ముఖారి

అవునయ్యా దొరవౌదు వన్నిటా నీవు
వివరముతోడి నన్ను వీరిడిఁ జేసేవు॥పల్లవి॥
  
  
యెవ్వతెనో సరివెట్టేవేఁటికి నాతోఁ జలము
పువ్వువంటి మనసిట్టె పూఁపసేసేవు
జవ్వనమదముతోనే సరినన్నుఁ జేరితేను
నవ్వులనె పొద్దువుచ్చి నాలిసేసేవు॥అవు॥
  
  
యెక్కడికైనాఁ బిలిచేవెగసక్కె మెంత నీకు
లక్కవంటి వలుపేల వుక్కుసేసేవు
లెక్కలేని యాసతోడ తెమ్మని నేఁగొసరితే
జక్కవ చన్నులేముట్టి జాగుసేసేవు॥అవు॥
  
  
యెంతవడైనాఁ గూడేవేమి నేరుచుకొంటివి
వంతవంటి సిగ్గేఁటికి వాఁకసేసేవు
యింతలో శ్రీవేంకటేశ యిద్దరముఁ గూడితిమి
దొంతిమోవి తేనెలిచ్చి దొరఁజేసేవు॥అవు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!