Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -789

అంగడిఁ బెట్టే వయసు అడియాల మానునే

రాగము: దేశాక్షి

అంగడిఁ బెట్టే వయసు అడియాల మానునే
బెంగతనాన నుండినాఁ బెడరేఁచుఁ గాక॥పల్లవి॥
  
  
వాసికి నెంతలిగినా వలపేల తక్కువౌను
ఆసలతోఁ జిగిరించి అలరుఁగాక
యీసున నెంతదిట్టినా ఇంపులేల కొంచమౌను
వేసరనిపులకలై విఱ్ఱవీఁగుఁగాక॥అంగ॥
  
  
ఆకడిమోమెఁతైనా ఆయమేల వూరకుండు
దీకొని తమకమై తిమురుఁగాక
చేకొని మాటాడకుంటే చిత్తమేల మరపించు
కాకుసేసి లోలోనె కరఁగించుఁగాక॥అంగ॥
  
  
చేయి చాఁచకుంటేను సెలవి నవ్వేల వుండు
తోయరానిసరసమై తొడరుఁగాక
యీయెడ శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
వేయిటికి నీరతులు వింతసేసుఁగాక॥అంగ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!