Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -808

అంగన లాతనివేళ అరసిరారో

రాగము: దేశాక్షి

అంగన లాతనివేళ అరసిరారో
సింగారరాయఁడు యేమిసేసీనో యీవేళ॥పల్లవి॥
  
  
వుప్పవడమౌ నిఁతక వువిదయుఁ దానీవేళ
అప్పఁడు దధ్యన్నము లారగించు నీవేళ
అప్పుడే మొకమజ్జన నువధరించు నీవేళ
ఇప్పు డేమిసేసీనో యెఱఁగ మీవేళ॥అంగ॥
  
  
తిరువారాధనవేళ తిరువందికాపువేళ
అరిది యప్పాలు నన్నాలారగించు నీవేళ
దొలరకొలు నీవేళ తోదోపు లీవేళ
సిరివరుఁడిపు డేమిసేసునో యీవేళ॥అంగ॥
  
  
యిట్టే యలమేలుమంగ యేకతమాడేవేళ
చుట్టి రా సంగరంగాలు చూచేవేళ
మెట్టి శ్రీవేంకటపతి మెరసి యేఁగేవేళ
చెట్టాపట్టాలతో రతిఁ జెలఁగు నీవేళ॥అంగ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!