Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -817

కర్త :: తాళ్లపాక అన్నమాచార్య

రాగము: శ్రీరాగం

అంగనా నీవును మాటలాడుకోరయ్యా
చెంగటనున్న చెలులు నేసేపని యేదయ్యా॥పల్లవి॥
  
  
వలపు లినుమడించె వాడికె లెదిరించె
చెలికి నీకు వావులు చిగిరించెను
తలఁపులు దైవారె తమకములు సందించె
యెలమి సుద్దులు మమ్ము నేమడిగేవయ్యా॥॥
  
  
కొనచూపులు గదిసె కోరిక లల్లులొనె
మన లిద్దరివిని మర్మము లంటె
ననుపులు సరిదాఁ కె నవ్వులు వియ్యములందె
యెనలేనివిచారము లిఁక నేఁటికయ్యా॥॥
  
  
మోవు లొక్కమరె మాఁగె మోహము లొండొంటి ముట్టె
భావించ సమరతులు బంతికి వచ్చె
శ్రీవేంకటేశ యింతిఁ జేకొని కూడితి విట్టె
యీవేళ నీసంతోసము లెంత చుపేవయ్యా॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!