Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -870

కర్త :: తాళ్లపాక అన్నమాచార్య

రాగము: సామంతం

అంత మనసునఁ గద్దు ఆపెకు నీమీఁది బత్తి
సంతోస మప్పటిఁ జేసీ చనవియ్యవయ్యా॥పల్లవి॥
  
  
ఘనమైననీదుచక్కనిరూపు చూచిచూచి
తనివి దీర దెంతైనాఁ దరుణికిని
పనివడి నీవలెనే బంగారుపతిమఁ జేసి
వెనుకొ నాపెమోమున వేలఁగట్టవయ్యా॥॥
  
  
సరసములాడి నీతో సారెకు నవ్వులు నవ్వీ
మరిగియున్నది నీ పై మచ్చికలెల్లా
సరుసఁగూచుండి నీవు చవులుగాఁ జెనకుచు
కెరలించి కెరలించి గిలిగించవయ్యా॥॥
  
  
ముట్టి నీపాదము లురమున నిడుక వొత్తుచు
యిట్టె పాయదు శ్రీ వేంకటేశ నిన్నును
నెట్టన నన్నేలితివి నీవింకా సొమ్ములు సేసి
మెట్టి నీపాదుకలాపెమెడఁ గట్టవయ్యా॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!