Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -882

అంతరుమాలినయట్టి అధములాల

రాగము: మలహరి

అంతరుమాలినయట్టి అధములాల
పొంత సంతకూటమి పొరిచూపు గాదా॥పల్లవి॥
  
  
కనక మిత్తడితోడ కలయ సరిదూఁచితే
అనువవునా అది దోషమవుఁ గాక
ఘనుఁడైన హరితోఁ గడుహీనదేవతల
ననిచి సరివెట్టితే నయమవునా భువిని॥అంత॥
  
  
పట్టభద్రుఁడు గూర్చుండే బలుసింహాసనముపై
వెట్టిబంటుఁ బెట్టేవారు వెఱ్ఱులేకారా
గట్టిగా శ్రీహరితోడ కలగంపదేవతలఁ
బెట్టి కొలుచుట విందువెట్టి పగగాదా॥అంత॥
  
  
కొంచక సింహముండేటి గుహ నుండవచ్చునా
పొంచి నక్కలకెల్ల బొక్కలే కాక
అంచెల శ్రీవేంకటేశుఁ డాత్మలోనే వుండఁగాను
కొంచపుదైవాల పలువంచలనే కాక॥అంత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!