Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -886

అంతరంతకు గాలినణఁగునా యనలంబు

రాగము: శ్రీరాగం

అంతరంతకు గాలినణఁగునా యనలంబు
కాంత నిట్టూర్పులాఁకలి చెరిచెఁ గాక॥పల్లవి॥
  
  
కలువలూరక నీటఁ గందునా యెందైనఁ
జెలియకన్నీరిట్లఁ జేసెఁ గాక
జలజంబుపై వేఁడి చల్లునా రవి యిట్ల
నలఁచి మదనాగ్ని వదనము నొంచెఁగాక॥అంత॥
  
  
విరులకునుఁ దుమ్మిదలు వెరచునా యెందైన
మరుబాణముల నెరులు మలఁగెఁగాక
సరుస మంచునఁ దీగె వాడునా యెందైన
అరిది చెమటలనె దేహము నొగిలెఁ గాక॥అంత॥
  
  
కుముదహితుఁడెందైనఁ గూడునా జక్కవల
కొమరె గుబ్బలమీఁదఁ గూడెఁ గాక
తిమిరంబు తిమిరమునఁ దెమలునా యెందైన
రమణి వేంకటవిభుని రతిమఱపుగాక॥అంత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!