Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -915

అంతేసి యెరఁగలేము ఆడువారము

రాగము: వరాళి

అంతేసి యెరఁగలేము ఆడువారము
మంతనాన విన్నవించే మన్నించవయ్యా॥పల్లవి॥
  
  
నీతో నేమాటాడితే నిజము నిష్ఠూరము
నీతెరిఁగి మాటలెల్ల నీవాడవయ్యా
చేతి మీఁదనే వుండవి చేకొను నామొక్కులెల్లా
మాతలఁపు లీడేరించి మన్నించవయ్యా॥అంతే॥
  
  
సారె నీతో నవ్వితేనే సరసమే విరసము
నారీతి చూచి నీవే నవ్వవయ్యా
గారవపు నాగోళ్ళు నీగడ్డము పైనుండవి
మారుకొని వేఁడుకొనే మన్నించవయ్యా॥అంతే॥
  
  
చన్నుల నిన్నొత్తితేనే చలములే పలములు
వున్నతిఁ గాఁగిట నీవే వొత్తవయ్యా
అన్నిటా శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
మన్నించి కూడితివింకా మన్నించవయ్యా॥అంతే॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!