Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -949

అందరును వినరమ్మ ఆమాఁట

రాగము: తెలుఁగుఁగాంబోది

అందరును వినరమ్మ ఆమాఁట
ఆందాలు చెప్పఁగవచ్చీ నమ్మరోయమ్మా॥పల్లవి॥
  
  
యీతల నన్ను రమ్మని యేఁటికి బిలిపించెనో
ఆతని నడుగరమ్మా ఆమాఁట
రాతిరెల్లా జాగరాలే రవ్వ కెక్కెఁ బగలెల్లా
చేఁతలేమి సేయవలెఁ జెప్పరోయమ్మా॥అంద॥
  
  
పనిలేనిపని కేల పంతమిచ్చెనో కాని
అనఁడా తా నావేళ ఆమాఁట
తనిసె నామనసెల్లాఁ దలకెక్కె వలపెల్లా
ఆనుమానా లేమిగల్లా నాడుమనరమ్మా॥అంద॥
  
  
యేకతానఁ జెప్పేనంటా నిందరి మిమ్ముఁ బొమ్మనె
అకడ నప్పుడే వింటి నామాఁట
పైకొని శ్రీవేంకటాద్రిపతి యింతసేసి కూడె
మీకుమీకే యిఁకనైనా మెచ్చుకోరేయమ్మా॥అంద॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!