Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -991

అందుకెంత సేసేవు అప్పటి నీవు

రాగము: ఆహిరి

అందుకెంత సేసేవు అప్పటి నీవు
కిందుపడి మొక్కఁగాను కేలు దాఁకెనపుడు॥పల్లవి॥
  
వెక్కసా లాడఁగ నేల వేడుకో నప్పటి నేల
వొక్కరీతినే గుట్టున నుండనీరాదా
చక్కనిరమణికి నీచనవిచ్చి రమ్మనఁగా
చెక్కునొక్కఁ బోతేను జీరవారె నపుడు॥అందు॥
  
సోఁక నలయించనేల సురటి విసరనేల
వూఁ కొనినమేలుతోడ నుండనీరాదా
యేఁకరి నీవే మోవియిమ్మనఁగాఁ దనపల్లు
సోఁకితేనే ముద్రలై చూపట్టెనపుడు॥అందు॥
  
కడుఁగాక రేఁచనేల గందము వుయ్యఁగనేల
వొడికాన నీవద్ద నుండనీరాదా
అడరి శ్రీ వేంకటేశ అప్పణిచ్చి కూడఁగాను
వుడివోక వురముపై నునికాయనిపుడు॥అందు॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!