Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -1015

అందుకేమి దోసమా అన్ని పనులునుఁ దేరీ

రాగము: దేసాళం

అందుకేమి దోసమా అన్ని పనులునుఁ దేరీ
చెందుచు నాచేఁతలెల్లాఁ జేసి చూపె నిఁకను॥పల్లవి॥
  
  
పానుపు పైఁ బవళించి పాదాలు నాపైఁ జాఁచి
మానలేక సతితోడ మాటలాడేవు
కానీరా నీతలపులు కానవచ్చె నాకు నేఁడు
నేనాపెఁ జెనకకుండా నెపము చేసితివి॥అందు॥
  
  
కోరి పచ్చడము గప్పి కుచములు నావి వట్టి
నారుకొన కాంతతోడ నవ్వు నవ్వేవు
నేరుతువౌరా మేలు నే నాపె దడవకుండా
వూరటగా నిదియొక వుపమ చేసితివి॥అందు॥
  
  
తెరలోననే వుండి తియ్యని నామోవి యాని
గరిమతో నంగనను కాఁగిలించేవు
యిరవై శ్రీ వేంకటేశ యే నాపెఁ గారించకుండా
సరవితో నిటువంటి చందము చేసితివి॥అందు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!