Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -1064

అందులకే వెరగయ్యీ నప్పటనుండి నాకు

రాగము: తెలుఁగుఁగాంబోది

అందులకే వెరగయ్యీ నప్పటనుండి నాకు
కందువ నెన్నాళ్లనుండి కాచుకవున్నదియో॥పల్లవి॥
  
  
కొత్త కొత్త మాఁట లాడీ కొమలి నీ తోడుత
యిత్తల వావిని నీకు నీమౌనోకాని
హత్తి కొలువులు సేసీ నప్పటి వేడుకతోడ
బత్తి నీపై నెంతగద్దో భావించితేఁ దనకు॥అందు॥
  
  
సొలసి సొలసి నిన్నుఁ జూచీని పలుమారు
పొలుపుగ నేనాఁటిపొందుగాని
చెలరేఁగి సేయరాని సేవలెల్లాఁ జేసీ నీకు
కొలఁదిమీర నిన్నేమి గోరీనో తాను॥అందు॥
  
  
నవ్వి నవ్వి మేలమాడీ ననుపున నీతోను
నివ్వటిల్లఁ దనయాస నీపై నెంతో
యివ్వల శ్రీవేంకటేశ యేలితిని నన్ను నేఁడు
రవ్వగాఁ దాఁ గాఁగిలించి రతికెక్క నిపుడు॥అందు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!