Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -11935

మగవాడు భ్రమసితే మగువలు దెలిపేరా

రాగము: మధ్యమావతి

మగవాడు భ్రమసితే మగువలు దెలిపేరా
తగులై వుండఁగానే తలఁచకుండుదురా॥పల్లవి॥
  
  
కడుఁ జల్లనిచూపుల కాంత నిన్నుఁ జూడఁగాను
యెడలేని కాఁకలు నీకేల రేఁగెను
వుడివోని కొనగోర నూఁది యెచ్చరించఁగాను
అడరి నివ్వెరఁగులు అమరునా నీకు॥మగ॥
  
  
సంతోసపుమాటలు సతి నీతో నాడఁగాను
ఇంతలోనే వెడచింత లేల వచ్చెను
వింత వింత నగవులు వేమారు నవ్వఁగాను
చెంతనుండి పంతములు చెల్లునా నీకు॥మగ॥
  
  
వాడికకాఁగిట నిన్ను వనితఁగూడఁగాను
యేడలేని తమకము లేల వచ్చెను
యీడనె శ్రీవేంకటేశ యీకె నిన్ను మెచ్చఁగాను
ఆడుకోలు బీరములు అందమౌనా నీకు॥మగ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!