Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -11937

మగవాని కింతయేల మరి కొంకను

రాగము: నాగవరాళి

మగవాని కింతయేల మరి కొంకను
అగడు సేయకు మమ్ము నందరిలో నిఁకను॥పల్లవి॥
  
అంగనతో నీవేకత మాడేవేళ వచ్చితేను
చెంగట నేఁడెంతేసి సిగ్గువడేవు
సంగతి నీవూడిగపు సతులలోదానఁ గానా
వెంగెము సేసుక యెంత వేరుసేసేవు॥॥
  
సరసిజాక్షితో నవ్వే సమయాన నే మొక్కితే
శిరసు వంచుక యాల సిగ్గువడేవు
అరిది నీరాణివామైనట్టి దానఁగానా
విరులమాఁటున నేల వెరగువడేవు॥॥
  
యీవేళ నింతిఁ గూడితి విట్టే నేనుఁ గూడితేను
శ్రీవేంకటేశుఁడ యేల సిగ్గువడేవు
గోవిందరాజ నిన్నుఁ గొలిచినదానఁ గానా
వేవేలు రతుల నేల వింతలు సేసేవు॥॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!