Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -11955
మగవాఁడు గూళ యైతే మరి చేతఁ బట్ట రాదు
రాగము: గుండక్రియ
మగవాఁడు గూళ యైతే మరి చేతఁ బట్ట రాదు | |
తగ వెరఁగక నీవే తమకించే విదివో | ॥పల్లవి॥ |
అంగనకు నీమనసు అరిసి తెలయుదాఁకా | |
నంగవించి నవ్వ దాయ నందుకే కదా | |
కుంగుచు నీవది చూచి కోపగించి వున్న దంటా | |
నండగిఁ బెట్టి వలపు లాడుకొనే విదివో | ॥మగవాడు॥ |
పడఁతికి నీ వాకడి పరాకు మానినదాఁకా | |
నడరి నీతో మాటాడ దుందుకే కదా | |
కడగి నీతో నాపె కైకొనక వున్న దంటా | |
వుడివోక గోర సేసి వుప్పతించే విదివో | ॥మగవాడు॥ |
జలజాక్షికిని నేవీ చనవు లిచ్చినదాఁకా | |
నలమక వూరకుండె నందుకే కాదా | |
యెలమి శ్రీవెంకటేశ యిట్టె నీవే కూడితివి | |
చలము చెల్లించే నంటా జట్టిగొనే విదివో | ॥మగవాడు॥ |
కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు