Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -11956

మగవాఁడు తనకే యమరుఁగా కేమి సేసినా

రాగము: హిందోళం

మగవాఁడు తనకే యమరుఁగా కేమి సేసినా
యెగసక్కెములు గావా యింతుల కీపనులు॥పల్లవి॥
  
  
చిగురాకుమోవి యేల చిల్లులు సేయవచ్చీనే
నగుమంటా నూరకే లానలు వెట్టినే
మొగమెత్తిచూడుమంటా మొనగోర నేలె త్తీనే
జిగిమించ సిగ్గుగాదా చెలుల కీపనులు॥మగ॥
  
  
బంగారువంటిచన్నులు పట్టియేల పిసికీనే
వంగి మొక్కుమంటాఁ గావరించీనేలే
చెంగల గూచుండుమంటా చెఱఁగేల ముట్టినే
సంగతి నార్జముగాదా సతుల కీపనులు॥మగ॥
  
  
అందపుఁ దీగెవంటిమే నందులకు బెనఁగీనేలే
పొంది కాఁగిటనే యెంత భోగించీనే
అందపు శ్రీవేంకటేశుఁ డలమేల్‌మంగను నేను
కందువ నవ్వులుగావా కాంతల కీపనులు॥మగ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!